ముగ్గురేగానీ సమైక్యవాదులకు ముచ్చెమటలు పట్టించిన్రు

20వేల మంది ఉన్న  సమైక్య శంబడకరావం సభలో తెలంగాణ నినాదం హోరెత్తింది.  శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీరాం, సతీష్ గౌడ్‌ లు సభను షేక్‌ చేసిన్రు. శంఖారావానికి తెలంగాణ సెగ తగిలిచ్చిన్రు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఉన్న వేదికపైకి ఓ తెలంగాణవాది బూటు విసరగా, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కొందరు సమైక్యసభలో జై తెలంగాణ నినాదాలు చేసి న్రు. ముందుగా.. ఆటోడ్రైవర్ సతీష్‌గౌడ్ సభలో జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘మా తెలంగాణ మాకే కావాలి. జై తెలంగాణ’ అంటూ నినదించిండు.  సీమాంధ్రులు సతీష్‌ గౌడ్‌పై విచక్షణా రహితంగా దాడిచేసిన్రు.  పోలీసులు సతీష్‌గౌడ్‌ను తీసుకెళ్లారు. ఈలోగానే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు గడ్డం శ్రీరాం, విద్యాసాగర్, శంకర్, సంతోష్‌నాయక్ సహా ఎనిమిది మంది విద్యార్థులు సమైక్య శంఖారావం సభ వద్దకు చేరుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్రకు చెందిన వారు విద్యార్థులపైకి వాటర్ ప్యాకెట్లు విసిరారు. మరికొందరు గడ్డం శ్రీరాంపై దాడి చేశారు.
సభ ప్రాంగణంలోకి బూట్ విసిరిన తెలంగాణవాది ఆకుల శ్రీనివాస్ రెడ్డి
జగన్‌ సభపై ఆగ్రహం వ్యక్తంచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర కో – ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి సభ వేదికపైకి బూట్ విసిరి, జై తెలంగాణ నినాదాలు చేసిండు. జగన్ ప్రసంగం ముగుస్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీనివాస్ రెడ్డిపై కొంతమంది సాక్షి మీడియా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ సేవాదళ్ నాయకులు ఒక్కసారిగా విరుచుకపడ్డరు. స్టేడియంలో ఉన్న బురద, చేతికందిన వస్తువుతో విచక్షణారహితంగా కొట్టిన్రు. అతెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలపై సభ ప్రాంగణంలో ఎవరూ ప్రస్తావించక పోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.