తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టి ముగ్గురు సీమాంధ్ర పార్టీల అధినేతలు ఒకే తాను ముక్కలమని నిరూపించుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు ఈ సమావేశానికి హాజరుకాకుండా తెలంగాణ విషయంలో తామంతా ఒకే తాను ముక్కలమని చాటుకున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు వెళ్లకపోవడానికి కారణమేంటీ: కేటీఆర్
తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ సమావేశానికి ఎందుకు హాజరు కావడంలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్లకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. తరచూ అఖిలపక్షమని కలువరించిన ఆయన ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదని కేటీఆర్ అన్నారు. అఖిలపక్షం వేస్తే తమ పార్టీ వైఖరి చెబుతామన్న బాబు ఢిల్లీ వెళ్లి తెలంగాణపై వైఖరి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలుగు కాంగ్రెస్ను ప్రజలు పాతరేస్తరు
తెలుగు కాంగ్రెస్కు ఇకపై తెలంగాణలో స్థానంలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలుగు కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు పాతరెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోన్న ఇటలీ కాంగ్రెస్కు దానికి అనుబంధంగా వ్యవహరిస్తోన్న చంచల్గూడ కాంగ్రెస్కు ఇక్కడి ప్రజలు పాతరేస్తారని ఆయనా ఆవేశంతో అన్నారు.