ముగిసిన పెద్దగట్టు జాతర

-మకరతోరణం తరలింపు
-20 లక్షల మంది భక్తుల సందర్శన
– దర్శించుకున్న కమలానంద భారతి
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల(పెద్దగట్టు) జాతర గురువారం మకర తోరణం తరలింపు తో ముగిసింది. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమలానంద భారతి చివరి రోజు లింగన్నను దర్శించున్నారు. ఐదు రోజులపాటు సుమారు 20 లక్షల మంది భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు.

ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కేసారం నుంచి దేవరపెట్టె, బోనం గంపను గుట్టపైకి తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవరపెట్టెలో ఉన్న దేవతామూర్తులను ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమవగా, గురువారం మకరతోరణం తరలింపుతో ముగిసింది. చివరి రోజు కూడా లక్ష మంది లింగన్నను దర్శించుకున్నారు. తెలంగాణలోని రెండో పెద్ద జాతరగా పేరుగాంచిన లింగమంతుల జాతరకు ఈ సారి భక్తులు హాజరయ్యారు. జాతరలో తొలి, చివరిరోజు అపశృతి చోటు చేసుకుంది. తొలి రోజు మంచినీటికోసం వెళ్లిన వరంగల్ జిల్లాకు చెందిన చీమల వెంకన్న చనిపోగా చివరిరోజు ఎగ్జిబిషన్‌లోని బ్రేక్‌డాన్స్‌లో పడి టీఆర్‌ఎస్వీ నాయకుడు పందిరి శ్రీకాంత్‌డ్డి మృతి చెందాడు. వచ్చే జాతరనాటికి పెద్దగట్టును రాష్ట్ర పండుగగా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.