ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను కూడా మోసం చేశాడు: డిప్యూటీ సీఎం


హైదరాబాద్: తెలంగాణ కల సాకారం కాబోతున్నదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నేడు అసెంబ్లీలో సీమాంధ్రుల దురహంకారం మరోమారు తేటతెల్లమైందని పేర్కొన్నారు. సభలో బిల్లుపై చర్చ జరగకుండా ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను కూడా మోసం చేశాడు. మీ నినాదం ఏంటి, విధానం ఏంటి. సీఎం సహా సీమాంధ్ర నాయకులు ఎవరిని ఫూల్ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఆర్టికల్ 3 లేకపోతే సీమాంధ్రులు మద్రాస్ ప్రభుత్వంలోనే ఉండేవారు. అప్పుడు ఆంధ్రులు మైనార్టీలు, తమిళులు మెజార్టీలు. సీమాంధ్ర ముఖ్యమంత్రిది దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చరిత్ర హీనుడు. సీమాంధ్ర సంస్కతి వేరు. తెలంగాణ సంస్కతి వేరు. భాషా పరంగా రాష్ర్టాల ఏర్పాటు కరెక్ట్ కాదని అంబ్కేద్కర్ సూచించారు. సీఎంకు కావాల్సింది పొలిటికల్ మైలేజీయే. కిరణ్ నీ ములాలు నువ్వు గుర్తుపెట్టుకో లేకుంటే చరిత్ర నిన్ను గుర్తించదని పేర్కొన్నారు. కిరణ్‌కు నైతిక విలువలు, నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఆప్రాంత ప్రజల తరుపున నిలబడాలని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.