ముఖ్యమంత్రి ప్లగ్.. అక్టోబర్ ఆరు లోపు పీకేస్తారు

హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే మరోసారి మహోద్యమంతప్పదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘లక్షమంది కిరణ్‌కుమార్‌డ్డిలు, లక్షమంది జగన్మోహన్‌డ్డిలు, లక్షమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణ వెంట్రుకకూడా పీక్కోలేరు’ అని తేల్చి చెప్పారు.
సంపూర్ణ తెలంగాణ సాధించేవరకూ ఉద్యమ పంథా కొనసాగించాలని సకల తెలంగాణ ఉద్యమ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోయినా ఎన్డీయే మనకు అండగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ కృషి కొనసాగించాలని కోరారు. తెలంగాణలో 85శాతంపైగా ప్రజలు బడుగు బలహీన వర్గాలేనని, రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కళ్లల్లో మెరుపులు చూడాలని ఆయన అభిలషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, హైదరాబాద్‌పై కుట్రలను తిప్పికొ టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ జరిగింది. సకల జన భేరి పేరుతో జరిగిన ఈ సభలో కేసీఆర్ తెలంగాణ శ్రేణులను ఉత్సాహపరుస్తూ.. దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యతిరేకులను చీల్చి చెండాడారు. సీఎం కిరణ్ అక్టోబర్ ఆరులోపు సీఎం పదవి నుంచి తప్పుకోవడం ఖాయమని తనకు సమాచారం ఉందన్నారు.సున్నితమైన ఈ సమయంలో సీఎం విజ్ఞత చూపి, రాష్ట్ర విభజనకు సహకరించాలని హితవు పలికారు. రాష్ట్రం నిట్టనిలువునా మానసికంగా విడిపోయిన తరుణంలో కూడా ఇంకా సమైక్యంగానే ఉంచాలనటం మూర్ఖత్వమే అన్నారు. కేసీఆర్ ఏమన్నారంఉపన్యాసం ఆయన మాటల్లోనే…

కిరికిరి రెడ్డి.. :
ఈ సభ చూడొద్దని తెలంగాణ జిల్లాల్లో కరెంటు కట్ చేశారు. నాగం మంచి పేరు పెట్టిండు కిరికిరిడ్డి అని. నాది, మా కోదండరాం, మా ఉద్యోగ నాయకుల స్పీచ్‌లు ప్రజలు వినకుండా చేస్తే ఆగుతదా? సీఎం పిచ్చి ప్రయత్నాలకు ఇదా టైమ్? కిరణ్‌కుమార్‌డ్డీ.. తెలంగాణతో గోక్కున్నవావ్లూవరూ ముందట పడలే. 2004లో చంద్రబాబు ఆరునెలల్ల ముంచేస్తా అన్నడు. ఇప్పుడేమైంది? ఎల్లకిల్ల పడ్డడు. లేచేపరిస్థితే లేదు. తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదని వెకిలి మాటలు మాట్లాడిన వైఎస్ పావురాల గుట్టలో పావురం అయిండు. నీకూ ఏదో పోయేకాలం వచ్చినట్లుంది. గీ టైమ్‌లో నిట్టనిలువునా చీలిక వచ్చిన తరువాత కలిపే ఉంచుతానని ఏ బేవకూఫ్ అయినా అంటడా? కలిసి ఉండగలమా? మానసికంగా విడిపోయాం.

చంద్రబాబు బతుక్కి ఎన్ని టర్న్‌లు?:
చంద్రబాబు పీ టర్న్ తీసుకున్నా అంటాడు. నీ బతుక్కి ఎన్ని టర్న్‌లు? వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ప్రజల టర్న్ గుర్తుకు రాలేదా? తెలంగాణ ఓట్లు మాత్రమే కావాలా? ఇక్కడి ప్రజల కష్టనష్టాలపై మాట్లాడవా? తెలంగాణ ప్రకటనరాగానే ఆంధ్రకు రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలన్నడు. నష్టపరిహారం దొబ్బినోళ్లకివ్వాల్న? నష్టపోయిన వాళ్లకు ఇవ్వాల్న? నష్టపోయింది తెలంగాణ కనుక మనకే ప్యాకేజీ ఇవ్వాలి. మహబూబ్‌నగర్‌లో సగం మంది వలస వెళ్లారు. నల్గొండలో ఫ్లోరైడ్‌తో చందమామల్లాంటి లక్షన్నర మంది అవిటివాళ్లయ్యారు. ఆదిలాబాద్‌లో అంటు రోగాలతో గిరిజనులు చచ్చిపోతున్నరు. ఇవి సమస్యలు కావన్నట్లు చంద్రబాబు ఆంధ్రా డబ్బాలతో కలిసి ప్యాకేజీ అంటున్నడు. జగన్ పార్టీ సమన్యాయం అంటోంది. అసలు మాకు న్యాయమే లేదు. ఇంకా సమన్యాయం ఎక్కడిది?

ఆంధ్రలో పుట్టినోళ్లంతా తెలంగాణ ద్రోహులే :
ఆంధ్రోళ్లు ఎప్పుడూఆంధ్రోళ్లే. లంకలో పుట్టినవన్నీ రాక్షసులే. ఆంధ్రలో పుట్టినవారంతా తెలంగాణ ద్రోహులే. విజ్ఞానులు ఎవరైనా అక్కడ ఉన్నారా? సీఎంకు తెలివుంటే ఈ సమయంలో ఎంత గంభీరంగా, గొప్పగా, దక్షతతో ఆలోచించాలి? తెలివుంటే ఇరు ప్రాంతాల నేతలను పిలిచి సమస్య పరిష్కరానికి కృషి చేయాలి. లేదంటే రాజీనామా చేయాలి.ఇది చరివూతాత్మక సందర్భం అని చూడకుండా అందరూ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోరికలో న్యాయం, ధర్మం ఉన్నది. భగవంతుడు వెంటున్నడు. లక్షమంది కిరణ్‌లు, లక్షమంది జగన్‌లు, లక్షమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరు. తెలంగాణ వెంట్రుకకూడా పీక్కోలేరు.

నాడు ఒక్కడినే..
నేడు యావత్ తెలంగాణ సమాజం: 2001లో నేనొక్కడికినే. ముందు కారుచీకటి. లాంతరు పట్టుకొని ప్రయాణం ప్రారంభించా. ధర్మం, న్యాయం ఉంటే విజయం సాధిస్తానని ముందడుగువేసిన. బక్కగున్నోడు నలిచిపారేద్దామనుకున్నారు. తెలంగాణ ప్రజలను ఏకం కానీయబోమంటూ దాడులు చేశారు. 13ఏళ్ల ప్రస్థానంలో క్రమంగా కారుమబ్బులు తొలిగాయి. ప్రజలు వాస్తవాలు గ్రహించారు. తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులకు తలవంచి నమస్కారం చేస్తున్నా. మీరిచ్చిన స్ఫూర్తి గొప్పది. ఈ వేదిక ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలే. హైదరాబాద్‌లో ఎక్కడచూసినా ర్యాలీలే. దీన్ని కొన్ని టీవీలు చూపకపోవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న మీకు అభినందనలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చిన.

చెమట రక్తంతో సాహిత్యాన్ని రికార్డింగ్ చేశారు: 2001లో కవి అందెశ్రీ, నేను కలిసి మా ఇంట్లో అన్నం తింటున్నప్పుడు ఎట్ల ఉద్యమం చేద్దామని అనుకున్నం. వెంటనే అంద్శై గారు నా దగ్గర పాశుపతాస్త్రంలాంటి పాటలున్నాయి. ఇంకా అసొంటి పాటలు రాస్తా అని చెప్పిండు. అద్భుతం ఆ పాటలు. గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, గూడ అంజన్నలాంటి అనేక మంది కవులు తెలంగాణ ఉద్యమానికి సాహిత్యం అందించారు. వారి చెమట, రక్తంతో పాటలు రికార్డింగ్ చేయించారు. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ పాట రాసిన నందిని సిధాడ్డిలాంటివారు అనేక పాటలు రాశా రు. 2002-03లో నేను కోదండరాం కలిసి ఎన్నోసార్లు తెలంగాణ మొత్తాన్ని ఒకే వేదిక మీదికి ఎట్లా తేవాలె అనుకున్నం. అప్పుడే విద్యావంతుల వేదిక పెట్టాం. ఇట్ల ఎన్నో సంఘాలు పెట్టాం. అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న కోదండరాం నేను తెలంగాణలోని 10 జిల్లాలు పక్షుల్లా తిరిగాం. తెలంగాణకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం గురించి ఆనాడు సమక్షిగంగా చెప్పినందునే నేడు తెలంగాణ సమాజం పూర్తిగా అర్థం చేసుకుంది.

సభా ప్రాంగణం సరిపోలేదు: సభ పెట్టెటప్పుడే నేను, కోదండరాం అనుకున్నం. ఎట్లైనా తిట్లపడ్తం అని. ఇక్కడున్న జనానికి 8, 9ట్లు అధికంగా రోడ్ల మీద ఉన్నారు. అసౌకర్యాల గురించి చింతించొద్దు. మల్లోసారి 70-80 ఎకరాల్లో సభపెడుతా.

భయం లేదు… బీజేపీ అండగా ఉంది:
బీజేపీ నేతలు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలపాలే. తెలంగాణకు భయం లేదు. ఎన్డీఏ అండగా ఉన్నది. అనుకున్న తెలంగాణ సాధించుకుందాం. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమం. సంపూర్ణ తెలంగాణ సాధించే వరకూ ఉద్యమ పంథా కొనసాగించాలి. తెలంగాణలో 85% బలహీనవర్గాలే. రేపు వాళ్ల కళ్లలో మెరుపులు చూడాలి. సమసమాజాన్ని సాధించాలి. ఇజ్జత్, మానం ఉంటే సీఎం నిబ్బరంగా వ్యవహరించాలి. ఆయనకు సంస్కారం ఉన్నదో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నది ప్రజలే
13 ఏళ్లు నన్ను, టీఆర్‌ఎస్‌ను నడిపించారు. నాలుగేళ్లుగా జేఏసీని, కోదండరాంను నడిపిస్తున్నది మీరే. ఒక్క పిలుపు ఇస్తే లక్షలాదిగా తరలి వచ్చారు. ఓపిక నశించొద్దు. ఆంధ్రలోని దళిత బహుజన సంఘాలు విభజనకు మద్దతుగా ఉద్యమిస్తున్నారు. కానీ ఆంధ్రా డబ్బాలు చూపిస్తలేవు. అరేంజ్‌డ్ మూమెంట్‌ను మాత్రం రోజంతా చూపిస్తున్నాయి. ఒక ఆంధ్రా కవి తెలంగాణది తొలికోడి కూత అయితే.. ఆంధ్రా ఉద్యమం గడియారం అలారం కూత అని విమర్శించాడు. అప్రమత్తంగా ఉండాలె. తేడా వస్తే ఉద్యమిద్దాం. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, నెటిజెన్స్ ఇలా అందరూ ఉన్నారు. ఈ స్ఫూర్తి కొనసాగాలి. ఇంత దూరం కళారూపాలతో వచ్చారు. వారందరికీ పేరుపేరున వందనాలు. జై తెలంగాణ.

సీఎం అక్టోబర్ ఆరో తారీఖు దాటడు
తెలంగాణ సాధనలో ఏనుగెళ్లింది. తోక చిక్కింది. దీపం ఆరిపోయేటప్పుడే ఎక్కువగా ఎలుగుతది. కిరణ్ కూడా అట్టనే ఎలుగుతున్నడు. నాకున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 6 తారీఖు దాటడు. కిరణ్ స్విచ్‌ఆఫ్ అయితడు. ప్లగ్ పీకేస్తారు. ఈ కిరణం బొగ్గైతది. దినేష్‌డ్డిని కోర్టే వెనక్కి పంపింది. సీఎంకూ తప్పదు. తెలంగాణ వస్తుంది. విభజన సందర్భంలో గత్తరబిత్తర పడొద్దు. మనం తప్పుటడుగు వేస్తే ముందు తరాలకు కష్టం. మనకు కావాలసింది హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ. తెలంగాణ ప్రజల గొప్పోళ్లు. పదేళ్లు కామన్ క్యాపిటల్‌కు ఒప్పుకున్నారు. సంస్కారహీనులను, దోపిడీదారులను మద్రాసులో మెడలు పట్టి నూకినట్లు నూకొద్దని సాటి తెలుగువారిగా ఒప్పుకున్నం. ఇందుకు దిగ్విజయ్ కూడా సంతోషంవ్యక్తం చేసిండు. ఇది మన సంస్కారం. ఆంధ్ర జేఏసీ అధ్యక్షుడు ముమ్మాటికీ సీఎమ్మే. ఎప్పుడు గుంజాల్నో.. అప్పుడు సీఎం ప్లగ్ గుంజుతం అని దిగ్విజయ్ చెప్పిండు. ఆంధ్రోళ్లు ఇక్కడ ఉండటం వల్ల వారు ఆ రాష్ట్రం జీతాలు తీసుకుని మన రాష్ట్రంలో ఖర్చుబెట్టుకుంటారు. దాని వల్ల ఏటా మనకు నాలుగైదు వేల సేల్స్‌టాక్స్ వస్తుంది. ఈ డబ్బుతో తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ బోనస్ ఇస్తాం.

తెలంగాణ వచ్చినంక కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, భీమా ప్రాజెక్టులు కడితే సీమాంధ్రకు నీళ్లు రావని సీఎం చెబుతున్నడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సీమాంవూధకు 90 టీఎంసీలు అలాట్ చేశారు కానీ మనం 300 టీఎంసీలు వాడుకుంటున్నం అని సీఎం చెబుతున్నడు. ఒక్క టీఎంసీ అలాట్‌మెంట్ లేని వెలిగోడు, వెలిగొండ, హంద్రీనీవాను ఎలా కట్టారు? శ్రీశైలంకు పెద్ద పొక్క పెంచి అక్రమంగా తీసుకొని పోతావా? సీఎంగా ఉండి ఒక ప్రాంతం గురించే మాట్లాతుంటే మాకు ఆశలు, కోర్కెలు, ఎమోషన్స్ ఉండవా? నీది మానవత్వం ఉన్న మాటేనా? దోపీడీ కొసాసాగించాలని, ఉద్యోగాలను కొట్టుకుపోవాలని, లూటీ చేసేందుకే సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారు. తల తెగిపడ్డా సరే.. ఆరు నూరైనా సరే తెలంగాణ ప్రజలు ఈ దోపిడీ కొనసాగన్విరు. వారు ఈ దుఖం నుండి బయటకు రావాలి. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తాం. పాలమూరు ఎత్తిపోతల, చేవెళ్ల-వూపాణహితకు జాతీయ హోదా ఇవ్వాలి. నష్టపోయింది మనం. మనకే ప్యాకేజీలు ఇవ్వాలే. నేను, కేకే ఢిల్లీకి పోయినప్పుడు తెలంగాణకు ఏమేమేం కావాలో లిస్టు రాసిచ్చి ఇచ్చినం.

సింహం సింగిల్‌గా వస్తది
సీమాంధ్ర ఉద్యమం చూస్తుంటే చాలా బాధైతుంది. చెప్తే ఇజ్జత్ పోతది. కోడీకలు, గడ్డి తింటున్నారు. ఆకులు కట్టకుంటున్నారు. సమాధుల మీద పంటున్నారు. ఒకడైతే పార్లమెంట్‌ల కొరడాలతో కొట్టుకుంటున్నాడు. ఇదా ఉద్య మం? ఉద్యమం చేసే బిడ్డలు ఎట్లుంటరు? సింహాల్లా ఉంటారు. నా తమ్ముడు బాల్‌రాజ్, పోలీస్ శ్రీనివాస్, శ్రీశైలం, చంద్రశేఖర్ ఆంధ్రోళ్ల మీటింగ్‌ల 40వేల మందిల ఒక్కరై జై తెలంగాణ అన్నారు. కుందేళ్లు మందగా పోతయి. సింహం సింగిల్‌గా పోతది. అశోక్‌బాబూ.. నీవు జై సమైక్యాంధ్ర అంటున్నావు. పోలీస్ శ్రీనివాస్ జై తెలంగాణ అంటున్నడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. నువ్వు శ్రీని వాస్‌ను ఎట్లా కొడతావ్?రోజూసమైక్యాంధ్ర అంటున్న సీఎంను ఎన్నిసార్లు కొట్టాలే? గుండె దిటవుతో జై తెలంగాణ అన్న శ్రీనివాస్ తెలంగాణ పౌరుషానికి, ఉద్యమానికి నిలువుటద్దం. మీదేం ఉద్యమం? దిక్కుమాలిన ఉద్యమం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.