మీదేమో ఆత్మగౌరవం, మాదికాదా? : కేటీఆర్

హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఇవాళ రచ్చబండ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ‘మీరు మద్రాసు నుంచి విడిపోతే ఆత్మగౌరవం. మేం విడిపోతే విభజన వాదమా? అని ప్రశ్నించారు. మీదేమో ఆత్మగౌరవం. మరి మాకు ఆత్మగౌరవంలేదా? మాది ఆత్మగౌరవం కాదా?’ అని ప్రశ్నించారు. ‘మేం విడిపోకూడదా?’ అని అన్నారు. కళ్లుండి కూడా చూడలేని కబోదిలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూట్లో రాయితీయలేని వాడు, ఏట్లో రాయి తీస్తానన్న చందంలా కిరణ్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.