మిస్టర్ నీరో కిరణ్.. గెలిచింది నువ్వా? మేమా?

(పోరుతెలంగాణ శ్రీనివాస్): ముట్టడిని కట్టడి చేసినందుకు సీఎంకు సోనియా ప్రశంసలట.. ఉద్యమాన్ని అడ్డుకున్నందుకు సీఎంకు మంచి క్రెడిట్ దక్కిందట.. . సోనియా ఎవడు చెప్పిండు నీకు చలో అసెంబ్లీని సీఎం అడ్డుకున్నడని? ఎంత నిర్బంధం విధించినా లక్షలాదిమందిని హైదరాబాద్ రాకుండా అడ్డుకున్నా.. తెలంగాణవాదులు హైదరాబాద్ చేరిన్రు.. అది మొదటి విజయం.. హైదరాబాద్ సరిహద్దుల్లో వేలాది మందని నిలిపివేసినా.. హైదరాబాద్ నడిబొడ్డు ఇందిరాపార్క్ కు చేరుకున్నరు..  ఇది తెలంగాణవాదులు సాధించిన రెండో విజయం..  అక్కడి నుంచి అస్సలు వెహికిల్స్ లేకున్నా అసెంబ్లీకి వెళ్లే దారులకు చేరుకున్నరు. ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకపూల్ బ్రిడ్జి, బషీర్ బాగ్ ముళ్లకంచెలు, ఇనుపగోడలను దాదాపు 30వేల మంది తెలంగాణవాదులు తాకారు.. ఇది తెలంగాణ సాధించిన మూడో విజయం.. ఇన్ని ఇనుపగోడలను సీఆర్పీఎఫ్ బలగాలను దాటుకొని అసెంబ్లీకి వందలాది మంది దూసుకొచ్చారు.. ఇది తెలంగాణవాదులు సాధించిన నాలుగో విజయం.. మా భయానికి సీఎం కిరణ్ కోడికుయ్యకముందుకే అసెంబ్లీకి వచ్చిండు.. తెల్లారినంక డిప్యూటీ సీఎం వెహికిల్ లో పారిపోతుంటే రవీంద్రభారతి దగ్గర తెలంగాణవాదులు అడ్డుకొని.. కాన్వాయ్ పైకి రాళ్లు విసిరారు.. ఇది తెలంగాణ సాధించిన అసలు విజయం.. ఎంత అణచివేత విధించినా.. ఎంత ఉక్కుపాదం మోపినా సీఎంవైన నువ్వే జడుసుకునేటట్టు చేసినం..  మిస్టర్ సీఎం ఇప్పుడు చెప్పు.. గెలిచింది నువ్వా తెలంగాణా? అసెంబ్లీని ఎంతమంది తాకారో ఈ ఫొటోలు చూడు..

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.