మిస్టర్‌ పిరాట్లు.. నీ థిరేట్లు ఊడకుండా చూసుకో.!

హరీష్‌రావు నేడు, ఫాం హౌస్‌లో కేసీఆర్‌ అంటూ ఉద్యమ నేతలపై విషపు కథనాలు రాస్తున్నది ఓ చెత్త పత్రిక. ప్రింట్‌ అయ్యేదే తొక్కలో 50 పత్రికలు.. ఇంతవరకు ఈ పత్రికను పైసలు పెట్టి కొన్నోడు లేడు. ప్రతిరోజు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తుందీ పత్రిక. కేసీఆర్‌ ఏడ ఉంటే నీకెందుకు బై. ఆయనిస్టం.. హైదరాబాద్‌ల ఉంటడు. ఫాంహౌస్‌ల ఉంటడు. సిద్దిపేటల ఉంటడు. నీకవసరమా? హరీష్‌రావుకు కరీంనగర్‌లో ఇల్లు, హైదరాబాద్‌లో  ఇల్లుందని, బిజినెస్‌లు ఉన్నయని ఎవడో ఆరోపిస్తున్నడని ఈ తొక్కలో పత్రిక రాసింది. బాబు.. పిరాట్ల వెంకటేశ్వర్లు.. హరీష్‌రావు ప్రస్తుతం ఉంటున్నది ఆయన తమ్ముడు మహేష్‌ ఇల్లు, కరీంనగర్‌లో ఉన్నది హరీష్‌ నాన్నది. బిజినెస్‌లు చేస్తున్నది ఆయన కష్టపడి సంపాదించిన పైసలతోటి. అయినా టీఆర్ఎస్‌ నేతలకు ఇండ్లు ఉండొద్దా? బిజినెస్‌లు ఉండొద్దా? మిస్టర్‌ పిరాట్ల వెంకటేశ్వర్లు.. ఎవడో ఆరోపిస్తే నువ్వు రాసుడేంది? నువ్వు బెడ్‌షీట్లు మార్చి పైకొచ్చావని.. సీఎం తమ్ముడు సంతోష్ రెడ్డి దగ్గర పైసలు తీసుకుని పత్రిక నడిపిస్తున్నవని..  నీ పత్రిక పేరు చెప్పి మాంచి ఖరైదైన కాంప్లెక్స్‌ కొట్టేసినవని మీడియా అంత చెప్పుకుంటున్నది. ఈ విషయం నిజమే అని మీడియా కోడై కూస్తున్నా మేము ఏనాడైనా రాసినమా?  నీ పత్రికలో పనిచేసినవారికి ఎన్నడైనా సక్కగ జీతాలిచ్చినవా? ఎంతమందికి నెలలకు నెలలు జీతాలు ఎగ్గొట్టినవో గుర్తున్నదా? నీ చరిత్ర ఎవరికి తెలియదు. పనిగట్టుకొని టీఆర్ఎస్‌ నేతలపై విషప్రచారం చేస్తే ఊరుకోం. మిస్టర్‌ పిరాట్లు.. నీ థిరేట్లు ఊడకుండా చూసుకో.  జగ్గారెడ్డి స్పాన్సర్డ్‌ స్టోరీస్‌ ఎన్ని రాసినా వేస్టే.. ఆధారాలుంటే రాయి.. లేకుంటే మూసుకో..!  నీ పత్రికొక్కటున్నదని ఎవరికీ తెలియదు.. అనవసరంగా నీ పత్రికకు ప్రచారం ఇవ్వ తలుచుకోలేదు. అందుకే నీ పత్రిక పేరు రాయలేదు.

This entry was posted in CRIME NEWS.

One Response to మిస్టర్‌ పిరాట్లు.. నీ థిరేట్లు ఊడకుండా చూసుకో.!

  1. B.Rajendra says:

    Enugu potunte Kukkalu Morugutai lite tisuko anna.