మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి-మంత్రి హరీశ్‌రావు

people must participate in mission kakatiyaకరీంనగర్: చెరువుల పూడికతీత కార్యక్రమంలో ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. మిషన్ కాకతీయపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు లేక రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చెరువుల పూడికతీతతో రైతాంగం అభివృద్ధిపథంలో పయనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. అసత్యాలు మాట్లాడితే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండాపోతుందని ఆయన పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.