మా తెలంగాణ..మాగ్గావాలి

 

gunpark-గన్‌పార్క్ వద్ద నినదించిన ఉద్యమకారులు
-కొవ్వొత్తుల ప్రదర్శన
-డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్
-మధు యాష్కీకి చేదు అనుభవం
-అడ్డుకున్న పలువురు ఉద్యమకారులు
తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద ఉద్యమకారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రపంచ తెలుగు మహాసభలు వద్దురా! తెలంగాణ ముద్దారా!’, ‘టీ కాంగ్రెస్ ఎంపీల్లారా ఖబడ్దార్.. రాజీనామాలు చేయండి..’, ‘ఇటలీ సోనియా డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఇప్పటికైనా తన మాటను నిలబెట్టుకోవాలని, మా తెలంగాణ మాగ్గావాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ సాధన కోసం మలి దశ ఉద్యమానికి సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, బీజేపీ, టీఆర్‌ఎస్ తదితర పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

రాజకీయ నాయకులే లక్ష్యంగా ఉద్యమం: కోదండరాం
నాడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష వల్లనే ఉద్యమకారుల్లో స్ఫూర్తి పెరిగి తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిందని కార్యక్షికమంలో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కేంద్రం ప్రకటనతో ఉద్యమకారులు విజయం సాధించారని, అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే అడ్డుతగలడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని పోగొట్టుకున్నామని పేర్కొన్నారు. నాటి ఉద్యమ ప్రేరణ మళ్లీ తీసుకురావాల్సిన ఆవశ్యకత, బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మలి దశ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రాజకీయ నాయకులే లక్ష్యంగా చేసుకొని ఉంటుందని కోదండరాం చెప్పారు.

ఉద్యమం ఉధృతమే: ఈటెల
డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని టీఆర్‌ఎస్ శాసన సభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

senior-citizensటీడీపీ, కాంగ్రెస్‌లే అడ్డుకున్నాయి: నాగం
విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకోవద్దని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పోరుబాట పట్టాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉద్యమంలో సుమారు వెయ్యిమంది బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలే అని తెలిపారు.

మధు యాష్కీకి చేదు అనుభవం
గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇక్కడికి రాగానే పలువురు తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ రావడం లేదు. కేవలం కల్లబొల్లి మాటాలతో మభ్యపెడుతున్నారు. సీమాంధ్ర తొత్తుల్లారా ఖబడ్దార్’ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగినవారిని పోలీసులు నిలువరించారు.

అడ్డుకుంటున్నది లగడపాటే: యాష్కీ
ఈ సందర్భంగా మధుయాష్కీ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ కోసం కేంద్రం నిర్వహించతలపెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయవద్దని కోరారు. తెలంగాణ కోసం సాగుతున్న ఉద్యమానికి ఎవరి సర్టిఫికేషన్ అక్కర్లేదని, తెలంగాణను ఢిల్లీ స్థాయిలో అడ్డుకుంటున్నది లగడపాటి వంటి లుచ్చా అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. వెంటనే అక్కడున్న వారు లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవివూపసాద్ రావు, ప్రధాన కార్యదర్శి కే రవీందర్‌డ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ అధ్యాపకుల ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, నగర టీఎన్జీవో శాఖ అధ్యక్షుడు కస్తూరి వెంక హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో శాఖ కార్యదర్శి ఎం హరిబాబు, ఉద్యమకారులు ఎం వేదకుమార్, టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకురాలు రేచల్, ఎంజులడ్డి, బీజేపీ నేతలు బండారు దత్తావూతేయ, సుధాకర్ శర్మ, అశోక్‌కుమార్ యాదవ్, టీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు తుల ఉమ, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి ఎంబీ కృష్ణాయాదవ్, ఉద్యమకారులు రామినేని శ్రీనివాస్ రావు, రాజమహేంవూదడ్డి, యాదయ్య, భద్రీసేన్, గంధం అంజన్న, నరేందర్ రెడ్డి, బాలరాజ్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.