మా చావు మేం చస్తాం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి-కేసీఆర్

 

kcr
– ఉక్కు కేటాయింపుల ఉత్తర్వులు రద్దు చేయాలి
– బయ్యారం ఉక్కు నాణ్యమైంది కాదంటావా?
– బొత్సా.. తిక్క మాటలు మాని క్షమాపణలు చెప్పు
– తెలంగాణ కోసం మేలో మహోద్యమం
– కాంగ్రెస్‌కు ఒక్క ఓటు.. టీడీపీ ఒక్క సీటు దక్కనీయం
– టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
– టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్
మాజీ జెడ్పీటీసీ రేఖా నాయక్

– మా చావు మేం చస్తాం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి
– ఉక్కు కేటాయింపుల ఉత్తర్వులు రద్దు చేయాలి
– బొత్సా.. తిక్క మాటలు మాని క్షమాపణలు చెప్పు
– తెలంగాణ కోసం మేలో మహోద్యమం : కేసీఆర్
– టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ రేఖా నాయక్
ఆంధ్ర పార్టీల నాయకులంతా తోడు దొంగలేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. బయ్యారంలోని ఇనుము నిక్షేపాలు నాణ్యమైనవి కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘బొత్సా! తలతిక్క మాటలు మానుకో’ అని హెచ్చరించారు. ‘బయ్యారం ఉక్కు ఎలా ఉంటే ఏం. మా చావు మేం చస్తాం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి. మా తెలంగాణ బిడ్డలకు మేం ఉద్యోగాలను ఇచ్చుకుంటాం’ అని కేసీఆర్ అన్నారు. బయ్యారం గనులపై తలతిక్క మాటలు మాట్లాడినందున బొత్స తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బయ్యారం గనులను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్షికమంలో కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అజ్మీరా రేఖా శ్యాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు ప్రజావూపతినిధులు, నాయకులు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా రేఖా నాయక్‌ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న విజయలక్ష్మీ చౌహాన్‌కు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మే నెలలో మహోద్యమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సందర్భం ఏదైనా తెలంగాణ సమాజమంతా ఒకవైపే ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఇప్పటికి వేయి ఆత్మబలిదానాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం దిగి రావ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గును సీమాంవూధకు తరలిస్తున్నారని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మణుగూరుకు దక్కాల్సిన థర్మల్ ప్రాజెక్టును విజయవాడకు తరలించారని, సింగరేణి బొగ్గును సీమాంవూధకు తరలిస్తున్నారని అన్నారు.

ప్రాంతీయతత్వంతోనే తెలంగాణలో నీటి ప్రాజెక్టులను చేపట్టకుండా పెండింగ్‌లో పెడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు మెడికల్ కాలేజీకి రూ.300కోట్లు కేటాయించి, నిజామాబాద్ మెడికల్ కాలేజీకి రూ.100కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు చెబితే తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎంకి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయనీయబోమని, తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి, ప్లేటు ఫిరాయించిన చంద్రబాబుకు ఒక్క సీటు దక్కనీయబోమని ఆయన శపథం చేశారు. వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదలరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని, ఆదిలాబాద్ జిల్లాలోని లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టును, మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఆయా జిల్లాల్లో ఉన్న ప్రతి పెండింగ్ ప్రాజెక్టును యుద్ధవూపాతిపదికన పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్షికమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, నల్లాల ఓదెలు, గడ్డం అరవిందడ్డి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి, ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ విభాగం అధ్యక్షుడు లోక భూమాడ్డి, తూర్పు విభాగం అధ్యక్షుడు పురాణం సతీష్, టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.