మావో నేలలో మహాత్ముడు!

బీజింగ్: చైర్మన్ మావో జెడాంగ్ భావజాల ప్రభావం తీవ్రంగా ఉన్న చైనా గడ్డపై తొలిసారిగా మహాత్మాగాంధీ ఆలోచనలు అడుగుపెట్టాయి. చైనీస్ భాషలోకి అనువాదం చేసిన ‘గాంధీస్ ఔట్‌స్టాండింగ్ లీడర్‌షిప్’ పుస్తకాన్ని తొలిసారిగా ప్రఖ్యాత పెకింగ్ యూనివర్సిటీలో సోమవా రం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని భారత మాజీ దౌత్యవేత్త, గాంధేయవాది పాస్కల్ అలెన్ నాజరత్ రచించగా ప్రొఫెసర్ షాంగ్ కుయన్యు చైనీస్‌లోకి అనువదించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.