హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇవాళ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన మాట్లాడారు. మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2006లోనే తెలంగాణకు మద్దతిస్తామని ప్రకటించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. అలాగే తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే తమ ఆశయమని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి లోక్‌సభలో సుష్మాస్వరాజ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీ విశేష కృషి చేశారని తెలిపారు. గతంలో తాము ఎలాంటి గొడవలు, సమస్యలు లేకుండా మూడు రాష్ర్టాలు ఇచ్చామని వెల్లడించారు. తెలంగాణలో నక్సలిజం నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడతామని వెల్లడించారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అభినందనీయమని తెలిపారు. గుజరాత్ అభివద్ధిని స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతత్వంలోని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అభినందించిందని తెలిపారు. దేశంలో సుపరిపాలన అందించే ఏకైకపార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావస వస్తువుల ధరలు చుక్కలనంటాయని విమర్శించారు.
మాట ఇచ్చాం, తెలంగాణ తెచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్
Posted on March 11, 2014
This entry was posted in TELANGANA NEWS, Top Stories.