మాకు.. తెలంగాణ కావాలి బాబు

చంద్రబాబు చేపట్టిన పాదయావూతలో భాగంగా మొగుళ్లపల్లి మండలం రాఘవడ్డిపేట శివారు ఆరెపల్లి సమీపంలో మహిళలు తెలం‘గానాన్ని’ వినిపించా రు.  బాబుతో వారి సంభాషణ సాగిందిలా..

బాబు : ఏమ్మా.. పంటలు ఎలా ఉన్నాయి..?
మహిళలు : ఏం పంటలు సార్.. పత్తి ధర లేదు. పెట్టుబడి వచ్చేట్టు లేదు…
బాబు : ఇంకేం సమస్యలున్నాయి…?
మహిళలు:కరెంటు సరిగ్గా ఉండడం లేదు. ధర లు విపరీతంగా పెరిగినయ్. ఏం కొనేటట్టు లేదు.
బాబు : మంచి రోజులొస్తాయ్. అధైర్యపడొద్దు.
మహిళలు(లక్ష్మి, సరోజన, సమ్మక్క) : ముందు మా తెలంగాణ మాకు కావాలి..
బాబు : తెలంగాణ నా చేతిలో లేదు.. నేను తెలంగాణ వ్యతిరేకిని కాను.లేఖ కూడా ఇచ్చాను అం టూ యాత్ర సాగించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.