మాకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు: కోమటిరెడ్డి

హైదరాబాద్: ఈ సీమాంధ్ర పాలకులు మా ప్రాంతానికి కనీకం మంచినీళ్లను కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీ బిల్లుపై అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును స్వాగతిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు.

నిన్న సభలో ముఖ్యమంత్రి ప్రసంగంపై స్పందిస్తూ సీఎం నిన్న సభానాయకుడిగా మాట్లాడారా? లేక పీలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా? స్పష్టత ఇవ్వాలి. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం కిరణ్ మాట మార్చి ద్రోహం చేసిండు. ఉన్నత పదవుల్లో ఉంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు. టర్మ్ ముగుస్తుందని సీఎం వందలాది ఫైళ్లను క్లియర్ చేసి లబ్ధి పొందారు.

ఇక చంద్రబాబు తీరు చూస్తే సమన్యాయం అంటారు అర్థమేంటో చెప్పరు. డిమాండ్ లేకుండా దీక్ష చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రైవేటు కంపెనీల పేరిట హైదరాబాద్ భూములు కొల్లగొట్టి కొలువుల్లో ఆంధ్రోళ్లు తిష్ఠవేసిన్రు. జీఎంఆర్ ఏయిర్‌పోర్ట్‌లో నాలుగు వందల మంది కూడా తెలంగాణ ఉద్యోగులు లేరు. భువనగిరిలో నిమ్స్‌కు ఇంత వరకు అతీగతీ లేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిధులు అడిగితే తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనని సీఎం అన్నడు. సీమాంధ్రులు ఇంత దోపిడీదారులని తెలియకనే ఆనాడు విలీనానికి కొందరు సహకరించారని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.