మహిళా శక్తికి జేజేలు

 

Narendra-Modi – యాభైశాతం మహిళలే ఆర్థికాభివృద్ధికి భరోసా
– సమానావకాశాలు కల్పిస్తే పురుషుల కన్నా రెండడుగులు ముందే
– ఫిక్కీ మహిళా సదస్సులో నరేంద్ర మోడీ
– పారిక్షిశామికరంగం మహిళా శక్తిని గుర్తించి ప్రోత్సహించాలి
– 21వ శతాబ్దంలో గర్భస్థ పిండాలను చంపుతున్నారని నిరసన
జాతీయస్థాయిలో నేతగా వెలుగొందాలన్న ఆకాంక్షతో ఇటీవలి కాలంలో కార్పొరేట్లను, యువతను తన ప్రసంగాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ తాజాగా మహిళల వైపు దృష్టి మరల్చారు. దేశంలో యాభైశాతం మహిళలే ఆర్థికాభివృద్ధిలో ఎంతో చేయగలరని పొగిడారు. సమానావకాశాలు కల్పిస్తే పురుషుల కన్నా రెండడుగులు ముందే ఉంటారని పేర్కొన్నారు. భారత వాణిజ్య, పారిక్షిశామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) మహిళా సంస్థ సోమవారం నిర్వహించిన భేటీలో ఆయన గంటపాటు చేసిన ప్రసంగంలో మహిళా పారిక్షిశామికత, సాధికారత, సమానత గురించి సోదాహరణంగా వివరిస్తూ, పిట్ట కథలతో, దృష్టాంతాలతో ఆకట్టుకున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని మహిళల గురించి, అముల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన పాడి పరిక్షిశమ ఉద్యమం గురించి గుర్తుచేశారు.

21వ శతాబ్దంలో గర్భస్థ పిండాలను చంపుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జాసు అనే మహిళ పిజ్జా మార్కెట్ గురించి వివరించారు. పరిపాలనపై విశ్వసనీయత లోపించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. రాహుల్‌గాంధీపై, గుజరాత్‌లోని మహిళా గవర్నర్‌పై విసుర్లేశారు. ‘‘ఆర్థిక విధాన నిర్ణాయక ప్రక్రియలో ఈనాటికీ మహిళా భాగస్వామ్యం లేదు. దీనిని మనం మార్చాల్సి ఉంది. వారిని విధాన నిర్ణాయక ప్రక్రియలోకి తీసుకురావాలి’’ అని ఆయన మహిళా ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య నొక్కిచెప్పారు. పారిక్షిశామికరంగం మహిళా శక్తిని గుర్తించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.

సుపరిపాలనకు టెక్నాలజీ, ప్రజాభాగస్వామ్యం తప్పనిసరి అని, అభివృద్ధికి సాయపడేందుకు అధికారాన్ని వికేంవూదీకరించాలని అన్నారు. విధానపరమైన పక్షపాతాన్ని నివారించాలంటే రాజకీయాలను తగ్గించాలని వ్యాఖ్యానించారు. మహిళల పరిక్షిశమ గురించి మాట్లాడుతూ మోడీ గుజరాత్‌లోని జాసు బెహన్ (సోదరి జాసు) పిజ్జాల గురించి ప్రస్తావించారు. అవి ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ బ్రాండ్లను తలదన్నవచ్చని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఇదివరలో మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య కళావతి గురించి పార్లమెంటులో ప్రస్తావించగా, మీడియా విస్తృత ప్రచారం కల్పించిన సంగతి తెలిసిందే. ‘‘కళావతి గురించి తెలుసుకున్నట్టుగానే జాసు బెహన్ గురించి ఆరా తీయడానికి వెళ్ళాలనుకు మీడియా మిత్రులకు ముందుగానే ఓ విషయం చెప్పదలచుకున్నాను. ఆమె ఇప్పుడు లేదు. ఐదేళ్ల కిందటే మరణించారు.

కానీ ఆమె పిజ్జాలకు ఇప్పటికీ ఎంతో మార్కెట్ ఉంది’’ అని మోడీ తెలిపారు. గుజరాత్‌లోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిందని, అయితే మహిళా గవర్నర్ కమలా బేణీవాల్ ఇప్పటికీ ఆమోదం తెలుపలేదని ఆయన విమర్శించారు. ‘‘మహిళ అయినప్పటికీ ఆమె ఆమోదం తెలుపకపోవడం నా దురదృష్టం’’ అని మోడీ విమర్శించారు. గుజరాత్‌లో ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేశామంటూ, ఇదివరలో కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ‘నా కాంగ్రెస్ మిత్రులు ఎన్నో బొక్కలు చేశారు. వాటిని ఇప్పటికీ పూడ్చాల్సి వస్తోంది. ఇప్పుడు అంతా చదునుచేసి హాయిగా ఆడుకోవడానికి వీలు కల్పించాను. ఇప్పుడు ఆకట్టుకునే మహా గుజరాత్‌ను నిర్మించాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని మోడీ బలపరిచారు. వివిధ రిటైల్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సమర్థించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.