మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం

జలవిహార్‌లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని సీఎం కేసీఆర్ కొనియాడారు. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గవర్నర్ పదవిని పొందిన మొట్టమొదటి వ్యక్తి విద్యాసాగర్‌రావు కావడం తెలంగాణకు దక్కిన గౌరవమన్నారు. విద్యాసాగర్‌రావుతో తనకు మూడు దశాబ్ధాల అనుంబంధం ఉందని తెలిపారు. భవిష్యత్‌లో విద్యాసాగర్‌రావు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని సీఎం కేసీఆర్ కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.