మహారాష్ట్రలో మళ్లీ డాన్స్‌బార్లు!

నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
మహారాష్ట్రలో ఏడేళ్ల కింద ట నిషేధించిన డాన్స్ బార్లు మళ్లీ తెరుచుకోనున్నా యి. డాన్స్ బార్ల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో బార్లను నిషేధి స్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బొంబా యి హైకోర్టు కొట్టివేయగా, హైకోర్టు తీర్పు ను సు ప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పు అమలుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తామస్ కబీర్, జస్టిస్ ఎస్‌ఎస్ నిస్సార్‌తో కూడిన ధర్మాస నం మంగళవారం ఎత్తివేసింది. డాన్స్ బార్లపై ఉక్కుపాదం మోపు తూ 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసు చట్టా న్ని సవరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను రెస్టాంట్లు, బార్ల సంఘం బొంబాయి హైకోర్టు సవాల్ చేసింది. హైకో ర్టు 2006లో ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో మహా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తీర్పుపై న్యాయ సమీక్ష నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.