మళ్లీ రాయల తెలంగాణ ఎందుకు?: వీహెచ్

హైదరాబాద్: రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని సీమ నేతలు కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)పై ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రాయలసీమ నేతలదాటికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములేవీ మిగలలేదని, మళ్లీ రాయల తెలంగాణ ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పాలితప్రాంతంగా ఒప్పుకోమని ఆయన తేల్చి చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.