మళ్లీ పేట్రేగిన పాక్!

ఐదుగురు భారత జవాన్లను కాల్చివేసిన ఘటనపై దుమారం రేగుతుండగానే పాకిస్థాన్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు నియంవూతణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద యూరీ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరాలపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున భారత భూభాగంలోకి ప్రవేశించి పాకిస్థాన్ మూకలు ఐదుగురు జవాన్లను కాల్చివేసిన ఘటన జరిగిన కొద్దిపటికే ఈ ఘటన జరిగింది. పాక్ సైన్యం కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారని, దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల్లో భారత్ వైపు ఎవరూ గాయపడలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కాల్పుల్లో పాకిస్థాన్ సైనికులు ఇద్దరు గాయపడటం లేదా, మృతి చెంది ఉంటారని ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. తాము ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినా భారత్ సైన్యం కాల్పులు జరిపిందని పాక్ సైన్యం ఆరోపిస్తోంది.

ఎల్‌వోసీ పరిస్థితిపై ఆర్మీ చీఫ్ బిక్రంసింగ్ సమీక్ష
జవాన్లను కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని ఎల్‌వోసీ వద్ద పరిస్థితిని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రంసింగ్ సమీక్షించారు. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన, పలువురు కమాండర్లతో కలిసి నాగ్రోటాలోని 16వ సైనిక దళాల ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు ఎల్‌వోసీలోని ఇటీవలి జరిగిన దాడులు, పాక్ కాల్పుల ఉల్లంఘనల గురించి ఆర్మీ అధికారులు వివరించారు. అంతకుముందు జమ్ము విమానాక్షిశయంలో అమరులైన జవాన్ల భౌతికకాయాలపై జాతీయ పతాకాన్ని కప్పి జనరల్ బిక్రంసింగ్ నివాళులర్పించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.