మళ్లీ తెడ్డు చూపిన తెలంగాణ ఎంపీలు

ఫస్టు నుంచి తెలంగాణ జనం అనుమానించిందే నిజమయింది. తెలంగాణ ఎంపీలు ప్రజలకు మళ్లీ తెడ్డు చూపెట్టిన్రు. టీ ఎంపీలు ముమ్మాటికీ ఉత్తర కుమారులే.. ప్రగల్భాలు ఎక్కువ.. పని తక్కువ. మీడియా ముందు మాట్లాడమంటే ఒగనెనుక ఇంకొకడు లైన్ కట్టి ఓ సోది దంచుతరు. రాజీనామాలపై వెనక్కి తగ్గేదేలేదని ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తు చెప్పిన్రు.  టీ కాంగ్రెస్ ఎంపీలు పీసీ చాకోతో మాట్లాడించుకుని అన్నీ మూసుకుని రాజీనామా చేయబోమని ప్రకటించిన్రు. ఆఫ్ట్రాల్ ఒక్క సంవత్సరమే ఉంది మీ పదవీకాలం దీనికోసం ఆశపడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన్రు. పైగా పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, సోనియా తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని ఎంపీలు అన్నరు. మరోవైపు మధుయాష్కి ప్రకటనతో తమకు సంబంధంలేదని చెప్పిన్రు. ప్రజల నుంచి వ్యతిరేకతతో సోనియాకు రాజీనామాలు ఇచ్చిన్రు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే స్పీకర్ కు రాజీనామాలు ఇవ్వండి. సోనియాకు ఇచ్చుడేంది?  సోనియా స్పీకర్ కు ఎట్ల పంపుతది? ఇది ఇంకో నాటకం. మీరు రాజీనామాలు ఆమోదించకునేదాక మిమ్మల్ని నమ్మం. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేదాక కాంగ్రెస్ కు నమ్మం. నమ్మితే మా చెప్పులతో మమ్మల్నిమేము కొట్టుకున్నట్టే.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.