మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించినట్టే ప్రకటించి జీహెచ్‌ఎంసీ శాంతి భద్రతలు గవర్నర్‌తో పాటు ఇద్దరు కేంద్ర ప్రతినిధులకు అప్పగించడం దురదృష్టకరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. సాంకేతిక ఉన్నత విద్యలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పుడున్న పద్ధతులు కొనసాగుతాయనడం తెలంగాణకు అన్యాయం చేయడమేనని కేసీఆర్ మండిపడ్డరు. ఇది సంబరాలకు సమయం కాదని ఆయన అన్నరు.  రేపు పొలిట్‌బ్యూరోలో చర్చించి టీఆర్‌ఎస్ ఉద్యమ పంథా నిర్ణయిస్తామని కేసీఆర్ తెలిపారు.

యూటీ అన్న పదాన్ని వాడకుండానే హైదరాబాద్ ను యూటీ చేసిన్రు. జీహెచ్ఎంసీ పరిధిలో కోటానుకోట్లు విలువచేసే భూములను అక్రమంగా దోచుకున్న పెట్టుబడిదారులు వాళ్లు అనుకున్న ప్రకారం గవర్నర్ చేతికి అధికారులను ఇఫ్పించిన్రు. మనకు తెల్వకుండనే హైదరాబాద్ ను ఆంధ్రోళ్లకు అప్పగిస్తున్నరు.  దీనికి వ్యతిరేకంగా ఇవాళ్టి బంద్ స్ఫూర్తితో ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవ్వాలని తెలంగాణవాదులంటున్నరు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.