మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంపు

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలతో సతమతవుతున్న రైతులు, ప్రజలపై ఈఆర్‌సీ విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపింది. 2013-14 విద్యుత్ టారీఫ్‌ను ఈఆర్‌సీ శనివారం విడుదల చేసింది. తాజాగా మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయ సేవా రుసుంలో ఎలాంటి మార్పులు లేవని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. 50 యూనిట్ల లోపు వినియోగం చేసే వారి పట్ల ఈఆర్‌సీ కనికరం చూపింది. టెలిస్కోపిక్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన డిస్కంల ప్రతిపాదనను తోసిపుచ్చింది. విద్యుత్ ఛార్జీలలో టెలిస్కోపిక్ విధానంనే కొనసాగించాలని ఈఆర్‌సీ తేల్చిచెప్పింది. గృహ విద్యుత్ శ్లాబ్‌లను ఈఆర్‌సీ పెంచింది. గతంలో గృహ వినియోగానికి 6 శ్లాబ్‌లు ఉండగా 10 శ్లాబ్‌లకు పెంచుతూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.