మరమగ్గాల కార్మికులకు ఎస్‌ఎఫ్‌ఏ ట్యాక్స్ ఎత్తివేయాలి- కేటీఆర్

వస్త్రపరిశ్రమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరితో ఆ పరిశ్రమ కుదేలవుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు.ప్రభుత్వం విధించిన ఎస్‌ఎఫ్‌ఏ ట్యాక్స్ వల్ల మరమగ్గాల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, దాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మరో వైపు ట్యాక్స్‌లు విధిస్తూ కార్మికులను బాధుతుందని అన్నారు. ఇది ఒక జేబులో డబ్బులు పెట్టి ఇంకో జేబులో నుంచి తీసుకున్నట్టు ఉందని తెలిపారు. వస్త్ర వ్యాపారులపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత పదమూడు రోజులుగా సిరిసిల్లలో మరమగ్గాల కార్మికులు సమ్మె చేస్తోన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటుందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల మరమగ్గాల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.