మమ్మల్ని రెచ్చగొడుతున్నారు: టీజీవోలు

హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని తాము హామీ ఇచ్చినప్పటికీ కొంత మంది ఉద్యోగులు పథకం ప్రకారం తమను రెచ్చగొడుతున్నారని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు ఆరోపించారు. ఈమేరకు టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలో తలెత్తే పరిణామాలకు సీమాంధ్ర ఉద్యోగులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.