మన మంత్రుల రోషమెక్కడ టీ మాటెక్కడ?

కీలక అంశాల్లో టీ మంత్రుల 

భాగస్వామ్యం కరువు
వారికి తెలియకుండానే
పథకాల ప్రకటనలు
తెలంగాణ ప్రయోజనాలు
దెబ్బతీసే నిర్ణయాలు
అవమానాలు ఎదురవుతున్నా..
పదవి వదలని నేతలు
అసంతృప్తి వెళ్లగక్కి
మిన్నకుంటున్న టీ అమాత్యులు
నేతల వ్యవహారశైలిపై ఉద్యమక్షిశేణుల ఆగ్రహం
వారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది అమాత్యులు! రాష్ట్ర కేబినెట్‌లో వారు 40 శాతం! కానీ.. కేబినెట్‌లో వారి మాట చెల్లదు! కొత్త పథకాలు ప్రవేశపెట్టే ముందు వారి అభివూపాయాన్ని పై నాయకత్వం తీసుకోదు! కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో చర్చించదు! వారిని విశ్వాసంలోకి తీసుకోదు! ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల్లోనూ వారి అభివూపాయానికి దిక్కుండదు! వారు కేవలం బొమ్మలు.. సీమాంధ్ర సర్కారు అడించినట్లు ఆడే.. కీలు బొమ్మలు! వారికీ కోపం వస్తుంటుంది.. ఆగ్రహావేశాలు అడపాదడపా కనిపిస్తుంటాయి! కానీ.. కాసేపటికే అంతా గప్‌చుప్! తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వబోమన్నా.. బయ్యారం గనులను ఏకపక్షంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించినా.. ‘ఆ జీవోను క్యాన్సిల్ చెయ్యను’ అని భీష్మించినా.. ఈ మంత్రుల నోరు పెగలదు! తమ శాఖ పరిధిలో అమలయ్యే ఆడబిడ్డ పథకం గురించి సంబంధిత శాఖ మంత్రికి చెప్పకపోయినా.. పట్టించుకోరు. అవమానాలు పక్కనపె అవహేళనలు మర్చిపోయి.. ఛీత్కారాలు దులిపేసుకుని.. బుగ్గకారులో వెళ్లి.. ఏసీ గదిలో సీట్లో కూర్చొని! హై హై నాయకా!! ఏదీ రోషం? ఏదీ తెలంగాణవాదం? ఏదీ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం పోరాటం? ఇది సమస్త తెలంగాణవాదులు అడుగుతున్న ప్రశ్న! ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా ఇంకా మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారనేది తెలంగాణకోసం తపించిపోతున్న ప్రజలకు కలుగుతున్న సందే హం! వారికి అధికారయావే తప్ప.. జనం గోస పట్టదనే అనుమానం! 

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త సంక్షేమ పథకాలు, ఆయా ఆంశాల్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై తమతో చర్చించలేదని, కనీసం మాట వరుసకైనా తమ వద్ద ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు.. తమకు ఎదురైన అవమానాలపై ఎందుకు గళం విప్పడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే బయ్యారం గనుల కేటాయింపు నిర్ణయం కూడా టీ మంత్రులకు తెలియని అవమానకర పరిస్థితి. పత్రిల్లో చూసి తెలుసుకోవాల్సిందే. అప్పటికైనా దానిని మాట వరసకు వ్యతిరేకించడం తప్పించి.. గట్టిగా నిలబడి అడ్డుకునే ప్రయత్నాలు కనిపించడం లేదు. తెలంగాణకోసం పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమించమంటే ఒప్పుకోని మంత్రులు.. తమ పైనాయకత్వం అవమానించినా..అవహేళన చేసినా.. నిర్ణయాల్లో భాగస్వాములను చేయకపోయినా మంత్రి పదవులకు వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ పదవుల ద్వారా నెరవేర్చే పైరవీలు.. అవి సమకూర్చే డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.ఓట్లకోసమే తెలంగాణ: రాష్ట్ర మంత్రి వర్గంలో సుమా రు 40 శాతం ప్రాతినిధ్యం కలిగి ఉన్న టీ మంత్రులు ఈ ప్రాంత సమస్యలపై నోరు విప్పరని ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. ఓట్లకోసమే వారికి తెలంగాణ ప్రజలు గుర్తొస్తారని, పదవుల కోసమే తెలంగాణ ప్రాంతం గుర్తొస్తుందని అంటున్నారు. సీమాంధ్ర పాలకుల చేతుల్లో అవమానాలు భరిద్దాం కానీ, తెలంగాణ కోసం, తమ స్వంత అస్తి త్వం కాపాడుకునేందుకు పోరాడుదామనే చిత్తశుద్ధి వారికి లేదనే విమర్శలు లేకపోలేవు. ఓవైపు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. దాని ని అడ్డుకునేందుకు చిన్నపాటి ప్రయత్నం చేయలేదని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజల నుంచి వస్తున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై టీ మంత్రులు ఏనాడూ గట్టిగా ఉద్యమించిన దాఖలాలు లేవు. పైగా ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో పదవులు కాపాడుకునేందుకు ప్రజల గొంతును అణచివేసి, వారి ఆకాంక్షలను తుంగలో తొక్కేలా టీ మంత్రులు వ్యవహరించారే తప్ప, ప్రజల మనోభావాల మేరకు సర్కార్ దిగివచ్చేలా చిన్నపాటి ప్రయత్నం చేయలేదని తెలంగాణవాదులు నిత్యం విమర్శిస్తుంటారు.

ఉద్యమాలకు మద్దతేది?: గత నాలుగేళ్ళుగా తెలంగాణ ఉద్యమం వివిధ దశల్లో ఉధృతంగా సాగింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయా రాజకీయ పార్టీలు, ప్రజలు, ఉద్యోగ, విద్యార్ధి, న్యాయవాదులు, డాక్టర్లు.. ఇలా సకల ప్రజాసంఘాలు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాటం సాగించారు. చివరకు అధికార టీ కాంగ్రెస్ ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం ఉద్యమబాట పట్టారు. ఆ సమయంలో కూడా టీ మంత్రులు కుర్చీలు, పదవులకు హత్తుకుపోయారు. ప్రాంతం కన్నా పదవులే ముఖ్యమన్నట్లు కూడబలుక్కుని వ్యవహరించారు. ఒకవైపు ఉద్యమకారులపై పోలీసుల లాఠీలు, వేధింపులు పెరిగాయి. పలు సందర్భాల్లో ఆందోళనకారులతో జైళ్లు నిండిపోయాయి. తెలంగాణ విషయంలో నేతల మోసాలకు కలతపడి.. వెయ్యి మందికిపైగా యువత బలిదానాలు చేశారు. ఇంతటి సమయంలోనూ తమ పదవులను వదల్లేదు. కనీసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అధిష్ఠానం ముందు పెట్టి.. పదవీ త్యాగానికి కూడా సిద్ధపడలేదని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకీ దూరం: తెలంగాణ సాధన ప్రక్రియలో అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకంటూ ఇక్కడి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అంటూ ఒకదానిని ఏర్పాటు చేసుకున్నారు.

దీనికి సైతం మంత్రులు దూరం పాటించారు. జానాడ్డి, సారయ్య, శ్రీధర్‌బాబు, గీతాడ్డి వంటి కొందరు తప్ప మిగిలినవావరూ అటు వెళ్లే సాహసం చేయలేదు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించినా.. టీ మంత్రులు మాత్రం సమస్యేలేదన్నారు. రాజీనామాలతోఅధిష్ఠానం దిగి వచ్చి తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సొంత పార్టీలోని టీవాదులే చెప్పినా.. మంత్రులు పదవులకే కట్టుబడ్డారు. స్టీరింగ్ కమిటీలో కొంతకాలం చురుకుగా కనిపించిన జానాడ్డి సైతం తాను ఇప్పుడంటే ఇప్పుడు రాజీనామాకు సిద్ధమని చెప్పారే తప్పించి.. ఏనాడూ రాజీనామా అస్త్రాన్ని బయటికి తీసిన సందర్భమేలేదు. ఎమ్మెల్యేగా ఉన్న బస్వరాజు సారయ్యకు మంత్రి పదవి రాగానే ఆయన గళం మూగబోయింది. గతంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిడ్డి వెంకట్‌డ్డి తమ పదవులను త్యాగం చేసినా పట్టించుకోని టీ మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందా? అంటూ వీరిని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడుతూ తమ వైఖరిని సమర్థించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఇళ్ల నుంచే ఫైళ్లు చక్కబెట్టిన ఘనత: తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో ప్రజలు, తెలంగాణవాదుల నుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు కేబినెట్ సమావేశాలకు వెళ్ళకూడదని మొదట భావించిన టీ మంత్రులు.. ఆ తరువాత కొద్ది రోజులకే తమ నిర్ణయం మార్చుకుని సమావేశాలకు హాజరై సీమాంధ్ర సర్కార్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తే హాజరవుతామని చెప్పి.. అక్కడ సమావేశంలో పాల్గొన్న తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే కాలంలో సచివాలయానికి వెళ్లేది లేదని భీష్మించిన అమాత్యులు.. ఇంటికే ఫైళ్లను తెప్పించుకుని.. ఆఫీసులో ఉన్నప్పటికంటే చురుకుగా.. వేగంగా ఫైళ్లను పరిష్కరించి.. ముఖ్యమంవూతితో సెభాషనిపించుకోవడం కూడా విమర్శలకు దారి తీసింది. ఉద్యమాల్లో మంత్రుపూక్కడ?: తెలంగాణ ఉద్యమాల్లో మంత్రుల పాత్ర చిటికెడంతైనా లేదని తెలంగాణ ఉద్యమ శ్రేణులు విమర్శిస్తున్నాయి. చరివూతాత్మకంగా సాగిన సకల జనుల సమ్మెకు టీ కాంగ్రెస్ ఎంపీలు సంఘీభావం తెలిపినా టీ మంత్రులు మద్దతు మాటే ఎత్తలేదు.

రైల్‌రోకో కార్యక్షికమాల్లో పాల్గొన్న సొంత పార్టీ ఎంపీలు, తెలంగాణవాదులను జైళ్లకు తరలించి కేసులు పెడుతుంటే.. తెలంగాణ మంత్రులు చోద్యం చూశారు. ఎంపీ అరెస్టులను ఏమాత్రం అడ్డుకోలేక పోయారు. ఇందిరాపార్క్ వద్ద టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం దీక్షలు చేపడితే ఒకరిద్దరు తప్ప మిగిలిన టీ మంత్రులంతా ముఖం చాటేశారు. అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుదామంటూ పలు సందర్భాల్లో టీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళితే.. దానికీ మంత్రులు దూరంగా ఉన్నారు. మంత్రి జానాడ్డి అడపా దడపా తెలంగాణ వేదికలపై కనిపించినప్పటికీ కీలకసమయంలో మంత్రులను తీసుకుని చేజారి పోతారనే విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రుల్లోనూ ఐక్యత లేదు: తెలంగాణ నుంచి రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉన్నా, వీరిలో ఐక్యత లేదన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ విషయంలో గట్టిగా మాట్లాడేందుకు వీరిలో 80 శాతం మంది మంత్రులు కూడా ముందుకు రారు. వచ్చినా… కలిసి పోరాడుదామనే భావం వారిలో అసలుకే ఉండదని పలువురు ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. తెలంగాణవాదానికి వ్యతిరేకంగా, రాష్ట్రం విడిపోకూడదంటూ ఒక్క కూత వేస్తే.. సీమాంధ్ర మంత్రులు అందరూ ఏకమై హైకమాండ్‌కు ముప్పు తిప్పలు పెట్టించి ముచ్చెమటలు పట్టిస్తారు. కానీ ఆ లక్షణాలు టీ మంత్రుల్లో మచ్చకైనా కనిపించవు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.