మనీలాండరింగ్యూలో అడ్డంగా దొరికిన మంత్రి శైలజానాథ్

మనీలాండరింగ్  ఇష్యూలో మంత్రి శైలజానాథ్  అడ్డంగా దొరికిపోయారు. కోబ్రా పోస్ట్ వైబ్‌  సైట్  స్టింగ్  ఆపరేషన్  లో మంత్రి అసలు వ్యవహారం బట్టబయలైంది.  తీవ్రమైన ఆర్థిక నేరమైన మానీలాండరింగ్  ముఠాకు మంత్రి సహకరిస్తున్న విషయం స్పష్టమైంది. బ్లాక్ మనీని తన అనుచరులకు అప్పగించండి… వారికి నేను గ్యారంటీ అంటూ శైలజానాథ్ పలికిన చిలుక పలుకులను కోబ్రా వైబ్  పోస్టింగ్  ప్రసారం చేసింది. ఐతే ఇంత జరిగినా మంత్రి మాత్రం తాను ఏ నేరం చేయలేదని బుకాయిస్తున్నారు.

మానీ లాండరింగ్. ఇదో తీవ్రమైన ఆర్థిక నేరం. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ గా నిలుస్తున్న వైట్ కాలర్ క్రైమ్. బ్లాక్ మనీ అక్రమార్కులకు వరం. ట్యాక్స్ కట్టకుండా అడ్డదారిలో సంపాదించిన సొమ్మును వైట్ మనీగా మార్చుకునే రాచమార్గం. దీనిపై కొంత కాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మానీలాడరింగ్ కు పాల్పడిన నేరస్థులు బెయిల్ కూడా దిక్కులేకుండా జైళ్లలో మగ్గారు. ఐనా సరే సమాజంలో పెద్ద పదవుల్లో ఉన్న వారే ఈ దందాకు అండగా నిలుస్తున్నారు. పైగా బ్లాక్ మనీ ఆరికట్టాల్సిన బ్యాంక్‌ లు సైతం మానీలాడరింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. గతంలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ పై మాత్రమే ఆరోపణలు రాగా… తాజాగా దేశవ్యాప్తంగా 20 బ్యాంకులకు పైగా ఈ దందా చేస్తున్నాయని కోబ్రా పోస్ట్ ఆధారాలతో సహా బయటపెట్టింది.

ఐతే ఈ వైట్ కాలర్ క్రైమ్ మన రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుండటం విశేషం. దానికి స్వయంగా రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సహా పలువురు అండదండలు అందిస్తున్నారు. బ్లాక్ మనీని హవాలా మార్గాల ద్వారా వైట్ మనీగా మార్పిస్తూ కమిషన్లు కొట్టేస్తున్నారు. ఈ బాగోతాన్ని కోబ్రా పోస్ట్ ఆధారాలతో సహా బయటపెట్టింది. రాష్ట్రమంత్రి శైలజానాథ్ సహా ఇండియన్ బ్యాంక్ ఢిల్లీ సౌత్ జోన్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్, ప్రముఖ ఆర్దోపెడిక్ట్ డాక్టర్ హరిప్రసాద్, వాసు అనే మాజీ పోలీసాధికారి ఈ రాకెట్ లో భాగం పంచుకున్నారు. ఐతే ఈ భాగోతం సమగ్రంగా తెలియాలంటే స్టింగ్ ఆపరేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఈ స్కాం ను బయటపెట్టేందుకు ముందుగా ఇండియన్ బ్యాంక్ ఢిల్లీ సౌత్ జోన్ మేనేజర్ మనోహర్ దగ్గరికి వెళ్లింది కోబ్రా పోస్ట్‌ టీం. ఆ ప్రతినిధి ఓ మంత్రి తాలుకా వ్యక్తినని తమ వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని చెప్పారు. ఏ సమస్య లేకుండా ఉండే విధంగా డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో హవాలా మార్గంలో అప్పటికే ఆరితేరిన మనోహర్ ఎలాగైనా సదరు వ్యక్తి డబ్బును మానీ లాండరింగ్ లో పెట్టించాలని భావించాడు. అతనికి అన్ని రకాల అకౌంట్ల గురించి చెప్పి బయపెట్టి మొత్తం మీద హవాలా మార్గమే సేఫ్ అని నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి  హవాలా మార్గంలో డబ్బు పెట్టేందుకు ఓకే అన్నాడు.  ఇక అక్కడ నుంచి సీన్‌ రాష్ట్రంలోకి మారింది. మీడియేటరైన రాష్ట్రానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ హవాలా వ్యాపారం లో దిట్ట అని చెప్పాడు. తిరుపతిలో  ఓ రియల్ ఏస్టేట్ ప్రాజెక్ట్ లో డబ్బు పెడితే చాలు. దాన్ని తము వైట్ మనీగా మార్చి చెక్కు రూపంలో వచ్చేలా చేస్తామని చెప్పారు.

ఇక అక్కడి నుంచి తిరుపతికి తీసుకొచ్చిన మనోహర్..  డాక్టర హరిప్రసాద్ ను పరిచయం చేశాడు. మనోహర్, హరిప్రసాద్ కలిసి తిరుపతిలోని అశోక హోటల్లో సదరు వ్యక్తి మానీలాండరింగ్ వ్యవహారాన్ని వివరించారు. తనకు నమ్మకం కలిగితే వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని సదరు వ్యక్తి చెప్పారు. ప్రస్తుతానికి 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఆ తర్వాత వందలకోట్లు పెట్టుబడి పెడతానని చెప్పారు. దీంతో మనోహర్, హరిప్రసాద్ సదరు వ్యక్తిని బుట్టలో పడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇలా కొన్ని మీటింగ్ ల తర్వాత మీకు డబ్బిస్తే తిరిగి వస్తుందని గ్యారంటీ ఏంటనీ ఆ వ్యక్తి వీళ్లను ప్రశ్నించాడు.

దీంతో ఇక తమ లెవల్ ఏంటో చూపించాలనుకున్న మనోహర్, హరిప్రసాద్ రాష్ట్రంలో వీళ్లకున్న సంబంధాలను ఇన్వెస్ట్ చేస్తానన్న వ్యక్తికి వివరించారు. సగం మంది మంత్రులు తన చేతిలో ఉన్నారని హరిప్రసాద్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి తనకు అత్యంత సన్నిహితులని కూడా చెప్పాడు. మిగతా సగం మంది మంత్రులు వాసు అనే హవాలా బ్రోకర్ కు పరిచయమని చెప్పారు. హవాలా వ్యాపారమంతా ఏ విధంగా సాగుతుందో తెలిపేందుకు వాసు అనే మాజీ పోలీసాధికారికి పరిచయం చేశారు. ఇతను హైటెక్ సిటిలో ఆఫీస్ మెయిటెన్ చేస్తూ హవాలా దందా హాయిగా చేసుకుంటున్నాడు. ఐతే వీరి నమ్మేందుకు  భయపడ్డ ఆ వ్యక్తి తన డబ్బుకు గ్యారంటీ ఇచ్చే పెద్ద మనిషి చూపించాలని అడిగాడు.

సరిగ్గా ఇక్కడే ఎంటరయ్యారు మంత్రి శైలజానాథ్ గారు. అప్పటికే ఈ హవాలా బ్రోకర్లతో మంచి పరిచయాలున్న మంత్రి గారి దగ్గరికి డబ్బు ఇన్వెస్ట్ చేస్తానన్న వ్యక్తిని హరిప్రసాద్ తీసుకొచ్చారు. మంత్రిగారూ పెద్దగా విషయం గురించి ఆరా తీయకుండానే హరిప్రసాద్ చాలా మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చారు. అతనికిచ్చే డబ్బుకు తాను గ్యారంటీ ఇస్తున్నట్లు ప్రకటించారు.  పైగా ఈ డీల్ కు మంత్రిగారూ ముద్దుగా ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. మంత్రి గారే స్వయంగా హామీ ఇస్తుండటంతో ఈ వ్యవహారంలో పెద్ద వ్యక్తులే ఉంటారని రిపోర్టర్ భావించాడు.  మంత్రి దగ్గర నుంచి కావాల్సినంతం సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఐతే కమిషన్ కు సంబంధించి మాత్రం ఢిల్లీ కి మాట్లాడతానని మంత్రి  చెప్పారు.  డబ్బు విషయంలో భయపడాల్సిందేమీ లేదని మంత్రి వచ్చిన వ్యక్తికి మంత్రి పదేపదే చెప్పారు.  రిపోర్టర్ తో మంత్రి గారి సంభాషణ వింటే ఈ వ్యవహారంతో ఆయనకు దగ్గరి సంబంధాలున్నాయన్న విషయం స్పష్టమవుతుంది. పైగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి  సంబంధించి స్వామిజీ అనే వ్యక్తి సైతం మంత్రి అప్పుడే ఫోన్ చేసి మాట్లాడారు.

ఐతే ఇంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మంత్రి గారి తీరు మారలేదు. తనకే పాపం తెలియదని బుకాయించారు. హరిప్రసాద్ తనకు తెలుసునని… ఆయనకు  డబ్బిస్తే గ్యారంటీ ఉంటానన్ననే తప్ప మానీలాండరింగ్ కు పాల్పడలేదంటున్నారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న ఈ హవాలా వ్యవహారంలో మరింత మంది ప్రముఖుల పాత్ర ఉంది. రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్టు తెలుస్తోంది. తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనతో జరిగిన సంభాషణను కోబ్రా పోస్ట్ రికార్డు చేయలేక పోయింది.

 

This entry was posted in ARTICLES, VIDEOS.

Comments are closed.