
వరంగల్‌కు పూర్వ వైభవం రావాలి: కేసీఆర్
హన్మకొండ: 11వ శతాబ్దంలోనే గొలుసు కట్టు చెరువులు నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జిల్లా వరంగల్. అలాంటి ఈ జిల్లాలో ప్రజలు మంచి నీటికి ఇబ్బంది పడుతున్నరని కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రభ పెరగాలి. వరంగల్‌కు పూర్వ వైభవం రావాలి. ఇంత చారిత్రక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం దారుణం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఎందుకు తెప్పించలేకపోయినరో పొన్నాల లక్ష్మయ్య సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు ఇచ్చి డ్రైనేజీ సిస్టం తీసుకొస్తం. ఎన్ని వందల కోట్లు ఖర్చయినా వరంగల్‌కు రింగ్‌రోడ్డు తెప్పిస్తం. హైదరాబాద్ తర్వాత పెద్దనగరం వరంగల్. హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చే మార్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ రావాల్సిన అవసరం ఉంది. టెక్స్టైల్ హబ్ వస్తే పదివేల ఉద్యోగాలు వస్తాయి. వరంగల్ ఫేట్ మారాలని ఆయన పేర్కొన్నారు