మద్రాస్ మర్యాదే కొనితెచ్చుకుంటారా?

– శ్రీనివాస్‌పై దాడి చూసినంక కలిసుండేదేంది?
– సీఎం దండయాత్రపై టీ మంత్రుల స్పందనేది:టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్
– సత్యవాణిలో కైకేయీ, గాంధారి: పేర్వారం
‘తెలంగాణలో కట్టిన నాగార్జున సాగర్ ఎడుమ కాలువను ఎత్తుకు పెట్టింది.. ఆంధ్రా ప్రాంతానికి పోయే కుడికాలువను ఒంపుకు పెట్టింది కేఎల్‌రావు. తెలంగాణలో నుంచి కరెంటు తీగలు గుంజుకుపోయింది నార్ల తాతారావు. సీమాంధ్ర ప్రజల మెదళ్లలో ఆలోచనలు మలిపింది రామోజీరావు. అన్ని విధా లా అన్యాయాలు చేసిన వాళ్లు ఇపుడు అపోహలు తొలగించుకునే సభ అని పేరు పెట్టి … దాన్ని సమైక్యాంధ్ర సభగా, తెలంగాణను అడ్డుకునే సభగా మార్చారు’ అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు.tngsravan జై తెలంగాణ అన్నందుకే కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను స్టేజీ కిందకు గుంజుకుపోయి చావగొట్టిన దారుణాన్ని, సీమాంధ్రుల హింసాపూరిత ప్రవర్తనను కళ్లనిండా చూసిన తెలంగాణ జాతి ఇప్పుడు ‘ఇంకా ఎందుకు కలిసుండాలి’ అంటూ ఆలోచన చేస్తోందని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అది పూర్తిగా ముఖ్యమంత్రి పెట్టిన సభేనని, సభ జరిగిన విధానం కూడా అదే రుజువు చేసిందన్నారు. ఉద్యోగుల ముసుగులో బెజవా డ రౌడీలను, గుండాలను తమపై దాడికి ఉసిగొల్పారని అన్నారు.

ఆ సభలో జరిగిన హింస కళ్లారా చూసిన తర్వాతైనా 13 సంవత్సరాల మలిదశ తెలంగాణ పోరాటాన్ని తాము ఎంత శాంతియుతంగా చేస్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు. మద్రాస్ నుంచి విడిపోయే సమయంలో ఆ పట్టణం కావాలని పేచీలు పెట్టారని, కానీ ఆనాటి తమిళులు వీరిని గెట్ అవుట్ అన్నారని… దాదాపు అదే పరిస్థితి ఇక్కడా పునరావృతం కాబోతోందని… అయితే ఆ పరిస్థితిని చేజేతులా సృష్టించుకుంటోంది సీమాంధ్రులేనని అన్నారు. తెలంగాణ ప్రజలపై సీఎం దండయాత్ర చేయిస్తుంటే తెలంగాణ మంత్రులు మాకేం బాధ్యత లేదన్నట్లుగా చూస్తున్నారని, సీఎం స్వయంగా పూనుకుని సీమాంధ్రులతో బహిరంగ సభ పెట్టిస్తుంటే ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఇక విభజన జరిగితే ఆర్టీసీ మునిగిపోతుందంటున్న వా రు… వాస్తవానికి రాష్ట్రం కలిసుం ఆర్టీసీ మునుగుతుందని గుర్తించాలని చెప్పారు.

కేశినేని, దివాకర్ ట్రావెల్స్ ఒకే నెంబర్‌పై 30 బస్సుల చొప్పున తిప్పుతున్నాయని, ఇలాంటి వారి వల్లనే ఆర్టీసీ మునిగిపోతోందని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టామని ప్రచారాలు చేసుకుంటున్నారని.. అయితే ఎవ్వరూ హైదరాబాద్‌కు పెట్టుబడులు పెట్టలేదని, చెప్పులు లేకుండా వచ్చి దోపిడీ చేసి వేలకోట్లకు పడగపూత్తింది సీమాంధ్రులేనని అన్నారు. రెడ్డీల్యాబ్స్ ఓనర్ ఇక్కడికి ఎట్లా వచ్చాడు…ఎక్కడ పనిచేశాడో తమకు తెలుసునని, జీవీకే లాంటి సంస్థలు ఎలా పుట్టాయో కూడా తెలుసునని అన్నారు.

సీఎం ప్రొడ్యూసర్, అశోక్‌బాబు డైరెక్టర్: జూపల్లి
ఎపీఎన్జీవోల సభకు ముఖ్యమంత్రి ప్రొడ్యూసర్‌గా, అశోక్‌బాబు డైరెక్టర్‌గా పనిచేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను మాజీ మావోయిస్టు అని మంత్రి శైలజానాథ్ అనడం దుర్మార్గమని, దళితమంత్రిగా ఇది తగునా? అని అన్నారు.

నాగరికత ఉందిగానీ.. సంస్కారం లేదు: పేర్వారం రాములు
ఏపీఎన్జీవోల సభ జరిగిన తీరు చూస్తే వారికి నాగరికత తెలుసుగానీ సంస్కారమే లేదన్నట్లుగా ప్రవర్తించారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ డీజీపీ రాములు అన్నా రు. ఎన్నిసార్లు రాజధానిని మార్చాలి? అని అడుగుతున్నవా ళ్లు అసలు ఎందుకు రాజధానిని మార్చారో తెలుసుకోవాలని సూచించారు. కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ సమయంలో హైదరాబాద్‌కు పోయి రాజభవనాలు అనుభవిద్దామని ఆనాటి ఆంధ్రాసీఎం అన్నాడని, ఇదంతా రికార్డుల్లో ఉందని అన్నారు. మా కవి కాలోజీ సీమాంధ్రులు తీరప్రాంతం వారేకానీ…. తీర్థానికి కూడా పనికిరాడంటారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు బువ్వ పెడ్తాయా అంటున్నారని, సీమాంధ్రులు కట్టిన హైటెక్‌సిటీ, పంజాగుట్ట ఫ్లైఓవరు మధ్యలోనే కూలిపోతాయన్నారు. చంచల్‌గూడ జైల్లో 420 కేసుల్లో ఎక్కడైనా తెలంగాణవారున్నారా..? అని ప్రశ్నించారు. సత్యవాణి మాట్లాడుతుంటే కైకేయీ, గాంధారి గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ అన్నందుకు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను కొట్టడానికి ఎవడికి చేతులు వచ్చాయని, కొట్టడానికి ఎవడికి అంత ధైర్యం వచ్చిందని మండిపడ్డారు.

ఏ సమస్య చెప్పారో చెప్పగలరా?: శ్రవణ్
రాష్ట్రం విడిపోతే వచ్చే 30 సమస్యలు చెబుతామన్నవారు ఏపీఎన్జీవోల సభలో కనీసం మూడు సమస్యలు కూడా చెప్పలేకపోయారని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఆ సభ యావత్తూ తెలంగాణ ప్రాంతంపై జరిగిన ఆధిపత్య సభగా కనిపించిందని మండిపడ్డారు. తెలుగువీర లేవరా.. తరమి తరిమి కొట్టరా.. అని పాడారని, ఎవరిని తరిమికొడతారో చెప్పాలని నిలదీశారు. కలిసుండాలనే వారి సమైక్య నీతి ఇదేనా? అని ప్రశ్నించారు. వంశీకృష్ణ, గజల్స్ శ్రీనివాస్ ఎక్కడి ఉద్యోగులు? వారెందుకు సభకు వెళ్లారని అంటూ హైకోర్టు ఆదేశంపై గౌరవం ఉండాలంటే అశోక్‌బాబుని ఏ1గా పెట్టి కేసు నమోదు చేయాలని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కిరణ్‌కుమార్‌డ్డే అని ఆరోపించారు. మిత్రా మాట్లాడిన మాటలు విని సుందరయ్య ఆత్మ వెక్కి ఏడ్చి ఉండొచ్చునని అన్నారు. సత్యవాణి కేసీఆర్‌ను తమ్ముడు అంటూనే ఆయనపై, తెలంగాణ ఉద్యమంపై విషం కక్కారని, బతుకమ్మను లేబర్‌పండుగ అని అవహేళన చేస్తున్నారని, సీమాంధ్రులకు బతుకమ్మ విలువ తెలుసా…? అని మండిపడ్డార

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.