మంత్రి వర్గం నుంచి డీఎల్ భర్తరఫ్

హైదరాబాద్: అసమ్మతి మంత్రులకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్ పెట్టారు. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై వేటు వేశారు. ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎల్‌ను కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు సీఎం కిరణ్ ప్రకటించారు. ఈమేరకు ఆయన డీఎల్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ గవర్నర్‌కు లేఖ రాశారు. డీఎల్ ఇప్పటి వరకు వైద్య విద్య, ఆస్పత్రి సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి డీఎల్ రవీంద్రారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న విషయం తెలిసిందే.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.