మంత్రి డీకే అరుణను అరెస్టు చేయాలి: నాగం

 

హైదరాబాద్: ప్రజా పంపిణీకి చెందిన నీలి కిరోసిన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్న మంత్రి డీకే అరుణను అరెస్టు చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమెను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రితోపాటు ఆమె భర్త భరతసింహారెడ్డిని కూడా అరెస్టు చేయాలని ఆయన అన్నారు. మంత్రిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన నిందితులను అరెస్టు చేయకుండా ఫిర్యాదు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదెక్కడి న్యాయం? అని ఆయన నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.