మండలిలో వాడివేడిగా చర్చ

హైదరాబాద్, జనవరి 9 : రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శాసనమండలిలో గురువారం వాడీవేడిగా చర్చ కొనసాగింది. బిల్లుపై మంత్రుల అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మంత్రుల వైఖరిని టీ-కాంక్షిగెస్ సభ్యులు తప్పుపట్టారు. చర్చకు పదే పదే అడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ సభ్యులను ఒక రోజు పాటు ఛైర్మన్ సస్పెండ్ చేసిన అనంతరం సభలో చర్చ కొనసాగింది. అంతకు ముందు గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ చక్రపాణి చర్చపై ఫ్లోర్ లీడర్ల అభివూపాయాలను కోరారు. టీడీపీ సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు విభజనపై కేంద్ర ప్రభుత్వం పంపిన సమాచారాన్ని సభలో పెట్టాలని, సీపీఐ నాయకుడు చంద్రశేఖర్ వెంటనే ముసాయిదాపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నేత ఆదిడ్డి అప్పారావు సమైక్యాంవూధపై తీర్మానం చేయాలని లేదా ముసాయిదాపై ఓటింగ్ జరపాలని పట్టుపట్టారు. అనంతరం బిల్లుపై చర్చ మొదలైందని శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి మాట్లాడుతారని ఛైర్మన్ ప్రకటించారు. మంత్రి ప్రసంగం ప్రారంభించగానే అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ సభ్యులు ప్రయత్నిస్తూ వెల్‌లోకి వచ్చారు. వారు సమైక్యాంధ్ర అనుకూల నినాదాలు చేస్తుండగానే మరో వైపు మంత్రి శైలజానాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంలోకి వచ్చి సమైక్య నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఛైర్మన్ చక్రపాణి సభను అర్థగంట పాటు వాయిదా వేశారు.

సభ తిరిగి మధ్యాహ్నం సమావేశంకాగానే శైలజానాథ్ ప్రసంగానికి వైఎస్సార్సీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. మంత్రి శైలజానాథ్ వారి తీరుపై విచారం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఛైర్మన్ చక్రపాణి వైఎస్సార్సీపీ సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు, బొద్దు భాస్కర రామారావు, నారాయణడ్డి, తిప్పాడ్డి, ఆదిడ్డిని సస్పెండ్ చేశారు.సస్సెన్షన్ కు నిరసనగా వారు సభలో ఆందోళన చేయగా ఛైర్మన్ చక్రపాణి తీవ్రంగా మందలించి మార్షల్స్‌తో బయటికి పంపించేశారు. అనంతరం చర్చను మంత్రి శైలజానాథ్ కొనసాగిస్తూ రాష్ట్రం ఏర్పాటుకు మందు తెలంగాణ ప్రాంతంలో దళితులు కాల్మొక్తా బాంచన్ అనే పరిస్థితి ఉండేదని …మళ్లీ రాష్ట్రాన్ని విభజిస్తే అవే పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నదీజలాల పంపకాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొనడంతో డీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎస్ మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవడ్డి జోక్యం చేసుకొని మంత్రి శైలజానాథ్ ఏ హోదాలో మాట్లాడుతారని ఛైర్మన్‌ను ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఛైర్మన్ జోక్యం చేసుకొని సభ్యులు వారివారి స్థానాల్లో కూర్చొవాలని ఆదేశించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.