మంజీరాకు మరో కుంభమేళా

– రేపటి నుంచి మొదలు..ఉత్తరాది నుంచి సాధువుల రాక
– పుణ్యస్నానాలకు హాజరవనున్న లక్షలాది మంది భక్తులు
– రూ.1.5 కోట్లతో మౌలిక వసతుల కల్పన
ఆంధ్ర-కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు లో పంచవటి క్షేత్రం సమీపనా మంజీరా నదికి రేపటి నుంచి 13 వరకు రెండో కుంభమేళా జరుగనుంది. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవపూర్ శివారు ప్రాంతం ఇప్పటికే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్రంలో బాసర తర్వా త రెండో సరస్వతి దేవాలయం, షిర్డీసాయిబాబా, సూర్యభగవాన్ క్షేత్రాలు పంచవటి ప్రత్యేకత. పంచవటి క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహించే మంజీరాకు తొలిసారి 2010లో కుంభమేళా నిర్వహించగా, గురువారం నుంచి రెండో కుంభమేళాను నిర్వహించనున్నారు. కుంభమేళాకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.1.50 కోట్ల లో రూ.30 లక్షలతో పంచవటిలో సీసీ రోడ్లు నిర్మించారు. అక్కడి నుంచి మంజీ రా నదీ తీరం వరకు రూ.50 లక్షలతో బీటీ, సీసీ రోడ్లను నిర్మించారు. కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు హరిద్వార్-అలహాబాద్‌లో కుంభమేళాలు నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణ భారతంలో మంజీరాకు మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. 12 ఏళ్లలో రెండుసార్లు సూర్యు డు ఈ రాశుల్లో ప్రవేశిస్తాడు. గురువారం సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండడంతో 13 వరకు కుంభమేళా నిర్వహించనున్నారు. గరుడ గంగలా ప్రసిద్ధి చెంది న మంజీరాలో పుణ్యస్నానాలు చేస్తే విశేషమైన హోమాలు చేసినన్ని పుణ్యఫలా లు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి సాధుసంతులు, మన రాష్ట్రం, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.