భూములు తెలంగాణవి.. కొలువులు ఆంధ్రోళ్లవి

ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి?
1980లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్ అనే ఐటీ కంపెనీ ఇండియాలో తన విభాగాన్ని ప్రారంభించేందుకు అనేక నగరాలు అన్వేషించి బెంగళూరును ఎంపిక చేసుకుంది. అప్పటి కర్ణాటక సీఎం గుండూరావు విమానాక్షిశయం సమీపంలో ఆ సంస్థకు స్థలం, వివిధ సౌకర్యా లు కేటాయించారు. అప్పటికి భారత్ ఐటీ రంగం తప్పటడుగులు వేసే దశలోనే ఉంది. అయినా అనేక మహానగరాలు వదిలేసి ఆ సంస్థ బెంగళూరును ఎంపికచేయడానికి ఆ కంపెనీయే పేర్కొన్న కారణాలు ఇవి. సమీపంలో విమానాక్షిశయం, పుష్కలంగా విద్యుత్తు, రాష్ట్రంలో ఉన్న రెండు వందల ఉన్నత విద్యా కళాశాలల్లో మానవ వనరులు, బీఈఎల్, హెచ్‌ఏఎల్, ఐఐటీ, బీఈఎంఎల్ వంటి కేంద్ర సంస్థలు ఈ సాప్ట్‌వేర్ వాడకానికి సిద్దంగా ఉండడం, ఇస్రోవంటి పరిశోధన రంగ పరిక్షిశమలు అప్పటికే నగరాన్ని విజ్ఞానరంగంలో అగ్రభాగాన నిలపడం.. వీటికితోడు నగరంలోని విశాలమైన రోడ్లు, ప్రకృతి బీభత్సాలు కనిపించని అనువైన వాతావరణం, సుస్థిర ప్రభుత్వాలు, ఆర్థికంగా పటిష్ఠ స్థితిలో ఉన్న రాష్ట్రం, దేశీయ విదేశీయ ఆర్థిక సంస్థలు. ఏ నాగరికతనైనా అందిపుచ్చుకునే కాస్మోపాలిటన్ నాగరికత…. ఆ పునాది నేడు బెంగళూరును దేశానికి ఐటీ రాజధానిగా మార్చాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులే హైదరాబాద్‌నూ ఐటీ రంగానికి వేదికను చేశాయి. అంతేతప్ప ఎవరో పూనుకుని ఏదో మాయామశ్చీంద్ర ఇంద్రజాలం చేయడం వల్ల కాదు.

దేశం ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నది.. కాదు ప్రపంచమే ఇటువైపు చూస్తున్నది. బహుళజాతి సంస్థల యాజమాన్యాలు పరిక్షిశమల ఏర్పాటుకు చూస్తున్నాయి. కోట్లకొద్దీ భారత యువత ఉద్యోగాల కోసం చూస్తున్నది. ఇతర రాష్ట్రాలు అభివృద్ధి మోడల్ అభ్యాసానికి చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చూపు తిప్పడం లేదు. కారణం.. ఇక్కడి అభివృద్ధి కొనసాగింపు వారి ప్రాథమ్యాల్లో ఒకటి కాబట్టి. ఇందరి చూపులన్నీ అయస్కాంతమై లాగేస్తున్న ఆ ఆకర్షణ.. నగరంలో నెలకొన్న ఐటీ! బీభత్సమెరుగని వాతావరణం, ఆర్థిక సంస్థల ఆలంబన, నీరు, విద్యుత్, రోడ్లు, రైళ్లు, విమానాల అనుసంధానం, పుష్కలమైన మానవ వనరులు, కాస్మోపాలిటన్ నాగరికత, ప్రజారక్షణ.. అన్నింటినీ మించి ప్రభుత్వ భూముల లభ్యత.. వెరసి నగరాన్ని ఐటీ రంగానికి రాజధానిగా మార్చాయి.

exportఈ నగరం మీద, ఈ రంగం మీద విభజన సమయంలో బురదచల్లే యత్నాలు, ఆకుకు పోకకు అందని వాదనలు ముందుకు వస్తున్నాయి. పక్కరాష్ట్రం పరుగుతీశాక పదేళ్లకుగానీ మేల్కొనని ప్రబుద్ధులు.. ఐటీ రంగం తమ మేధోశిశువనే విచిత్ర ప్రేలాపనలు చేస్తున్నారు. సప్త సమువూదాలు గాలించి దేశదేశాలన్నీ చుట్టబెట్టి కట్టగట్టి కంపెనీలను తెచ్చామంటున్నారు తమ భవిష్యత్తు తామే ఎరుగని విజనరీలు. కంపెనీలన్నీ తమ ప్రాంతం వారివేనంటూ ఢంకా బజాయించి వాదనలు చేస్తున్నారు మరికొందరు. విభజనతో నష్టమంటూ ఆరున్కొక్క రాగాలాపనకు దిగుతున్నారు ఇంకొందరు. ఇందులో వాస్తవాలేమిటి? నగరంలో ఐటీ రంగం ఎవరి సృష్టి? పరిక్షిశమలు ఎందుకు తరలివచ్చాయి? కంపెనీలు పెట్టిందెవరు? బోర్డులు తిప్పిందెవరు? భూములిచ్చిందెవరు? భుక్తి పొందిందెవ్వరు? నగరంలో ఐటీ రంగం గతమేమిటి.. వర్తమానమేమంటున్నది.. భవిష్యత్తేమిటి..?

polairసిటీబ్యూరో, టీ మీడియా :ఎవన్ని చెప్పుకున్నా హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలే ఇక్కడ ఐటీ రంగానికి బాటలు వేశాయి. నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, రోడ్డు, రైలు, విమానయాన రవాణా సౌకర్యాలు, పుష్కలమైన విద్యుత్తు, మంచినీటి వసతి, నగరంలో ఆతిథ్య రంగం, కాస్మోపాలిటన్ సంస్కృతి, మార్పును అందిపుచ్చుకునే మానవ వనరులు ఇక్కడ ఐటీ రంగాన్ని పాదుకొల్పేలా చేశాయి. అన్నింటినీ మించి పాశ్యాత్య దేశాలు ఎదుర్కునే ప్రధాన సమస్య ప్రకృతి బీభత్సాలకు ఇక్కడ తావే లేదు. ఏడాది పొడవునా ఆరు రుతువుల్లోనూ సురక్షిత వాతావరణం ఇక్కడ ఉండడం ఐటీ రంగానికి ఆలంబన. పూర్తిగా కమ్యూనికేషన్ రంగంతో అనుసంధానమై ఉండే ఈ రంగానికి ప్రకృతి బీభత్సాలకు పొత్తు కుదరదు. ఏ ప్రకృతి విలయం సంభవించినా తొలిదెబ్బ పడేది ఐటీ రంగంపైనే. అలాంటి అవకాశం లేకపోవడం నగరానికి ఉన్న పెద్ద పెట్టుబడి. ఇక ఇవన్నీ పక్కన పెట్టినా ఐటీ రంగంలో దిగ్గజాలన్నీ ప్రపంచాన్ని శాసించే బహుళజాతి సంస్థలే.

MBAఇలాంటి సంస్థలు ఆతిథ్యానికో మూడు దండలు, నాలుగు పొగడ్తలకు పడిపోయో, ఎవరో పైరవీ చేశారనో కోట్లకు కోట్లు కుమ్మరించవు. ఈ అర్హతలతోనే నగరం ఐటీకి స్వర్గధామంగా మారింది. ఏడాదికేడాది పురోభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతోంది. గడిచిన 14 సంవత్సరాల కాలం నుంచి హైదరాబాద్‌లో 1282 ఐటీ కంపెనీలు నెలకొల్పారు. నగరం లో ప్రస్తుతం యానిమేషన్ కంపెనీలు, గేమింగ్ కంపెనీలు, డిజిటల్ ఫిల్మ్ ప్రొడక్ష న్ విభాగం, మ్యూజిక్ స్టూడియోలు, టీవీ స్టూడియోలు, ప్రపంచ పరిజ్ఞానం కలిగిన యానిమేషన్, గేమింగ్ ట్రైనింగ్ సెంటర్. రెగ్యులరైజేషన్ సపోర్ట్ కార్యాలయం, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్ పరిక్షిశమలు వెలిశాయి. ఎలక్ట్రానిక్స్, హర్డ్‌వేర్, బీపీవో, హెల్త్, ఇన్స్యూన్స్ రంగాలు ఐటీ రంగంలో అంతర్భాగంగా పురోగమిస్తున్నాయి.

బేగంపేటలోనే తొలికంపెనీ…
హైదరాబాద్ ఐటీకి బేగంపేట నుంచి పునాది పడిందని చెప్పుకోవచ్చు. 1997లో ఇంటర్‌క్షిగాఫ్ కన్సల్‌టెన్సీ బేగంపేటలో మొదటి ఐటీ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ కంపెనీ విదేశీ కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సేవలందించేది. 80 మంది ఈ కంపెనీలో ఉద్యోగులుగా పని చేశారు. ఆ ఇంటర్‌క్షిగాఫ్ ఇంకా అలాగే కొనసాగుతున్నది. తర్వాత కాలంలో సోనాటా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ బేగంపేట నుంచే పనిచేసింది. తర్వాత కాలంలో ఈ రంగం వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఆయా కంపెనీలు భారీగా భూములు కేటాయించాక మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాలకు వ్యాపించాయి. మాదాపూర్‌లో సైబర్‌టవర్స్, రహేజా మైండ్ స్పేస్, అసెండాస్, వీబీఐటీ పార్కుల ఏర్పాటుతో ఐటీ హద్దులు చెరిగిపోయాయి. క్రమంగా మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు క్యూ. కట్టాయి. మొదట ఔట్‌సోర్సింగ్ కంపెనీలుగా ప్రారంభమైన యూనిట్లను మల్టినేషనల్ కంపెనీలు హస్తగతం చేసుకున్నాయి. సీఏ, పృథ్వి, యాడ్‌లాబ్స్, వాల్యు ల్యాబ్స్, విర్టుసా, నోవా, వెబెక్స్, లాంటి చిన్న చిన్న కంపెనీలను అవి కొనుగోలు చేశాయి.

ITసంవత్సరాల వారిగా ఐటీ గ్రోత్
‘ఫార్చ్యూన్ 500’ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగూల్, ఐబీఎమ్, ఒరాకిల్, డెల్, మోటరోలా, డెలాయిట్, కన్వర్జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, హోనీ సీమెన్స్, జేపీ మోర్గాన్, యూనైటెడ్ హెల్త్ గ్రూప్, టీసీఎస్,. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ మహింద్రా సత్యం, కాగ్నిజెంట్, పాట్నీ, టెక్ మహింద్రా, సోనాటా, ఇన్ఫోటెక్ కంపెనీలు హైదరాబాద్‌పై మక్కువ చూపాయి. ఈ రంగం గ్రోత్ రేట్ దేశవ్యాప్తంగా 15.7 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 16 శాతంగా నమోదయ్యింది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో 12.4 శాతం తో దేశంలోనే నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తోంది. రాష్ట్రం నుంచి మొత్తం ఎగుమతుల్లో 39 శాతం ఎగుమతులు ఐటీ రంగానికి చెందినవే కావడం గమనార్హం. 53. 246 కోట్ల మొత్తం ఎగుమతులు ఉండగా 28.948 కోట్లు సెజ్‌ల ద్వారా,12.600 కోట్లు డొమెస్టిక్ ద్వారా ఎగుమతి అవుతున్నాయి.

DLFభారీ అంచనాలు..
తాజాగా నగర నలుదిశలా ఐటీ హబ్‌లు ఏర్పాటు కానున్న దృష్ట్యా అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు రానున్నాయి. ఇప్పుడున్న కంపెనీలకు తోడు జేపీ మోర్గాన్, వోక్స్‌వ్యాగన్, జనరల్ ఎలక్ట్రికల్, ఫేస్‌బుక్, హెచ్‌పీ, ఐబీఎమ్, అమెజాన్, గూగూల్, ఓరాకిల్, సీఏ టెక్నాలజీ, సిమాంటిక్, డెల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు పూర్తి స్థాయిలో వందలాలది కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకోనున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, మామిడిపల్లి, రావిర్యాల్, ఆదిభట్ల, మహేశ్వరం, ఉప్పల్, పోచారం ప్రాంతాలన్నీ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడనున్నాయి. ఐటీఐఆర్ పాలసీ అమలుతో 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, సుమారు 53 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఐటీ రంగానికి అవసరమైన ముఖ్య వనరు మానవ వనరులే. నిజానికి పాశ్చాత్య దేశాలనుంచి ఐటీ భారత్‌కు తరలివచ్చింది కూడా ఇక్కడ చవగ్గా మానవ వనరులు దొరుకుతున్నందుకే. నగరంలో ఏడాదికేడాది లక్షలాది గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు వర్క్‌ఫోర్స్‌గా మారి ఐటీ సంస్థలకు సేవలందిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చుట్టు పక్కలా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఐటీ లక్ష్యంగా వందల సంఖ్యలో విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రతీ ఏటా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది సాంకేతిక నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు.

రవాణా సౌకర్యాలు
దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, అంతర్జాతీయ నగరాలకు వాయుమార్గం కనెక్టివిటీ ఉండటం, రోడ్డు, రైలు సౌకర్యాలు కలిగి ఉండటం హైదరాబాద్‌కు ప్రత్యేకం. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్యలో ఉండటం అనుకూలం. దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రోజుకు 30 విమానాలు, 160 రైళ్లు, 2 వేల బస్సులు నిత్యం రవాణా సౌకర్యాన్ని అందజేస్తున్నాయి. లండన్, బ్యాంకాక్, ఫ్రాంక్‌ఫర్ట్, సింగపూర్, కౌలాలంపూర్ మధ్య తూర్పు దేశాలకు నేరుగా వాయుమార్గం కలిగి ఉండటం. టెలిఫోన్ ఎక్సెంజీలు, ఆఫ్టిర్ ఫైబర్ కమ్యూనికేషన్ లైన్లు ఉండటం, వంద మందికి 11.8గా టెలిఫోన్ సాంద్రత కలిగి ఉండటం అనుకూలం. క్రైం రేట్ కూడా తక్కువగా ఉండటం, లక్ష మందికి 193 క్రైం రేట్ నమోదవడం భద్రతకు భరోసా.

ఐటీ కంపెనీల్లో తాము భారీగా పెట్టుబడులు పెట్టామంటూ సీమాంవూధులు చేస్తున్న వాదనలన్నీ వట్టివే. ఈ రంగంలో వారి పెట్టుబడులు నామమావూతమే. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 75 శాతం మంది,ఇక్కడి నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో 85 శాతం ఎమ్‌ఎన్‌సీ కంపెనీలవే. ప్రస్తుతం ఉన్న కంపెనీల్లో ఒక్కటి కూడా దేశీయ కంపెనీ లేకపోవడం గమనార్హం. నిర్మాణ రంగాన్ని మొత్తం మన దేశీయ కంపెనీలే ఏలుతున్నాయి. ఐటీ సెజ్‌లు, పార్కుల్లోని భవనాలను మాత్రం దేశీయ కంపెనీలు నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి గల కంపెనీలు మన వద్ద ఉన్నా ఐటీ రంగంలో మాత్రం దేశీయ పెట్టుబడులు అంతంతమావూతమే.

హైదరాబాదే ఎందుకు?..
ప్రపంచ సీఈవోల ఆర్గనైజేషన్ హైదరాబాద్‌ను మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్‌గా ప్రకటించింది. భూకంపాలు, ప్రకృతి విలయాల భయం లేని ప్రాంతంగా పరిక్షిశమలు నెలకొల్పుకోవడానికి అనువైనదిగా గుర్తించింది. రోడ్డు రవాణా, రోడ్ల విస్తరణ కూడా అవసరానికి మించి నమోదవుతోంది. బెంగళూరులో 100 మీటర్ల విస్తీర్ణం గల రోడ్లు అవసరం ఉండగా, 30 మీటర్ల రోడ్లే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం 100 మీటర్ల రోడ్డు అవసరం ఉంటే 140 మీటర్ల రోడ్డు సౌకర్యం ఉంది. ఇక్కడున్న ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు, టెలిఫోన్ లైన్లు కుడా ఐటీ రంగానికి దోహదకారిగా నిలుస్తున్నాయి. ఐటీ కారిడార్‌గా ప్రకటించిన ఏరియా విస్తీర్ణం 33 కిలోమీటర్లు కాగా 42 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఆఫ్టికల్ కేబుల్, టెలిఫోన్ కేబుల్లు ఏర్పాటు చేశారు.

మిగతా రాష్ట్రాలతో విమానాక్షిశయాల నుంచి ఐటీ కారిడార్లకు ప్రయాణ కాలం చాలా ఎక్కువగా ఉంటోంది. గతంలోహైదరాబాద్ విమానాశ్రయం నగరం నడి మధ్యన ఉండేది. ఇలా మరే ఇతర నగరంలో లేదు. తర్వాత ఐటీపరిశ్రమలు శివారుకు తరలాక శంషాబాద్ అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయం నుంచి కేవలం 30 నిమిషాల్లో ఐటీ కారిడార్‌కు చేరుకునే సౌ కర్యం ఉంది. పుణే ఎయిర్‌పోర్టు నుంచి 1:20 గం టలు, ముంబై గంటన్నర నుంచి 3 గంటలు, బెంగళూరు 2 గంటలు, నోయిడాలో 3 గంటలు సమయం తీసుకుంటోందిపభుత్వ అనుమతులు, లైసెన్స్ క్లియన్స్‌లు త్వరితగతిన పరిష్కరించడంలో దేశంలో రెండో స్థానంలో నిలుస్తోందంటూ 2009లో వెలవరించిన ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకటించింది. తాము గుర్తించిన మోస్ట్ ఇంప్టాంట్ సెంటర్స్‌లో హైదరాబాద్ ఒకటని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. ‘ఆంవూధవూపదేశ్ హ్యాజ్ బికమ్ వన్ ఆఫ్ ది గ్లోబల్ ఐటీ సెంటర్స్’ అంటూ అమోరికా ఐటీ అసోసియేషన్ ప్రకటించింది. అందుకు కారణం ఇక్కడి వ్యాపారవేత్తల్లోని నైపుణ్యాలు, ఇక్కడున్న వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం, నాయకత్వం అందించే స్ట్రాంగ్ సపోర్ట్ అంటూ హైదరాబాద్ గురించి కితాబిచ్చారు. ఇక్కడ కంపెనీలు మారే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఉన్నదాంట్లోనే ఉద్యోగులు సర్దుకునే వాతావరణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని శాసిస్తున్న ప్రతీ కంపెనీకి హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌లు, యూనిట్లు ఉన్నాయి. గూగూల్ కంపెనీ దేశంలోనే మొదటి యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది ఫేస్‌బుక్ ఆసియాలో మొదటి యూనిట్‌ను ఇక్కడ ప్రారంభిస్తున్నది. ఐబీఎం ప్రధాన యూనిట్లన్ని ఇక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయి. టీసీఎస్ కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్నన్ని ప్రాజెక్ట్‌లు దేశంలో మరెక్కడా లేవు. అంతర్జాతీయ స్థాయిలో 41 మస్ట్ విజిట్ సిటీస్‌లో హైదరాబాద్ స్థానం సంపాదించింది. ఆ జాబితాలో హైదరాబాద్ 19వ స్థానంలో ఉంది.

ప్రభుత్వ రంగంలో సెజ్‌లు..
-ఐటీ/ఐటీస్ సెజ్ కోసం సర్వే నెం 115 నానక్‌రామ్‌గూడ శేరిలింగంపల్లిలో 40.70 ఎకరాలు కేటాయించారు.
-హెచ్‌ఎండీఏ ఐటీ/ఐటీస్ సెజ్ కోకాపేట వద్ద 119.08 ఎకరాలు ఇచ్చారు. దీనిలో 19 కంపెనీలు ప్రారంభం కానున్నాయి.
ప్రైవేట్ రంగంలో సెజ్‌లు..
-శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో విర్టుసా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 6.32 ఎకరాలిచ్చారు.
-శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెర్రా అట్లాంటిక్ సాఫ్ట్‌వేర్‌కు 7.20 ఎకరాలిచ్చారు
-టీఎస్‌ఐ బిజినెస్ పార్కు హైదరాబాద్ లిమిటెడ్‌కు శేరిలింగంపల్లి మండలం సర్వే నెం 115/ పీలో 12. 13 ఎకరాలిచ్చారు
-ఆమెజాన్ ఐటీ సర్వీసెస్‌కు 12/పీ, 13,14, 15/పీలో 10.57 ఎకరాలు కేటాయించారు.
-మహీంద్రా సత్యంకు బహూద్దూర్‌పల్లి కుత్బుల్లాపూర్ మండలం సర్వేనెం 62/1.ఏలో 7 ఎకరాలు మంజూరు చేశారు.
-మహీంద్రా సత్యంకు 29 ఎకరాలు హైటెక్ సిటీ మాదాపూర్ శేరిలింగంపల్లిలో ఇచ్చారు
-విప్రొ కంపెనికి సర్వే నెం 203/1 మణికొండ జాగీర్‌లో 40 ఎకరాలు ఇచ్చారు
-సీఎమ్‌సీ లిమిటెడ్‌కు సినర్జీ పార్క్‌కు శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి నెం 2-56/1/36 సర్వే నెం 26 50.87 ఎకరాలు కేటాయించారు.
-జెన్‌ప్యాక్ట్ ఇండియా లిమిటెడ్‌కు శామిర్‌పేట మండలం జవహార్‌నగర్ సర్వే నెం 12 50.57 ఎకరాలిచ్చారు
-విప్రొ లిమిటెడ్ సర్వే నెం 124/పీ 132/ పీ గోపన్‌పల్లి వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి మండలంలో 13 ఎకరాలిచ్చారు.
-ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌కు ఘట్‌కేసర్ మండలం పోచారం 41, 36 /Part,36/P 44 & 45(P), 48, 49, 50(P), 51 & 54 సర్వే నెంలో 447 ఎకరాలు కేటాయించారు.
-కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల సర్వే నెం 225లో 40 ఎకరాలిచ్చారు.
-టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్‌కు సర్వే నెం 225లో ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో 75 ఎకరాలిచ్చారు.
-మరో 25 ప్రైవేట్ డెవలపర్లు ఏర్పాటు చేస్తున్న ఐటీ సెజ్‌ల కోసం 14 వందల ఎకరాల సేకరణకు అనుమతిచ్చారు. ఇవన్ని కుడా అంతర్జాతీయ స్థాయి కంపెనీలే కావడం. హైదరాబాద్‌లోనే పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం హైదరాబాద్‌కు ఉన్న బ్రాంచ్ ఇమేజ్‌కు చిహ్నంగా చెప్పకోవచ్చు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.