భూమయ్య యాక్సిడెంట్ పై విచారణ జరిపించాలి

పోలీసులు, ప్రభుత్వం కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్యను హత్య చేసిందని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఆకుల భూమయ్యది ప్రమాదం వల్ల జరిగిన మరణం కాదని, ప్రభుత్వమే హత్య చేయించినట్లు తమవద్ద స్పష్టమైన సమాచారం ఉన్నదని అన్నారు. మంగళవారం రాత్రి మృతిచెందిన ఆకుల భూమయ్య మృతదేహానికి ముషీరాబాద్ తహశీల్దార్ సుజాత సమక్షంలో గాంధీ ఫోరెన్సిక్ విభాగం వైద్య నిపుణులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. అంతకుముందు ఆకుల భూమయ్య మృతిపై ఆయన కూతురు సునీత నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమయ్య మృతితో ఆయన భార్య అరుణ, కుమ్తాలు చారులత, సునీత, కవితలు శోకసంవూదంలో మునిగిపోయారు. మార్చురీ వద్ద భూమయ్య సోదరులు చంద్రన్న, నర్సన్న, మల్లన్న, శేషన్న,రాజన్న, రవీందర్‌లు అన్నను తలుచుకుంటూ కంటతడిపెట్టారు.
bumaya1అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ ఆస్పత్రి నుంచి ఆశ్రునయనాల మధ్య తెలంగాణ నినాదాలతో సికింవూదాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకుచ్చారు. అక్కడే పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భూమయ్య ఆశలు కొనసాగిస్తామని కవులు, కళాకారులతో ప్రజా గాయకుడు గద్దర్ పాటల రూపంలో ప్రతిజ్ఞ చేయించారు. 2.30 గంటలకు భూమయ్య స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా కాచాపూర్‌కు అంబుపూన్స్‌లో భౌతికకాయాన్ని తరలించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో పలుచోట్ల ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 10గంటలకు కాచాపూర్‌లో అంత్యక్షికియలు జరుగుతాయని భూమయ్యకు సన్నిహితుడైన చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడుతున్న బెల్లి లలిత నుంచి మొదలుకుని భూమయ్య వరకు జరిగిన హత్యల్లో ఏ ఒక్కటీ సహజమరణం కాదన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదం ఎప్పుడైతే బలంగా రాష్ట్రపతికి వినిపిస్తున్నారో అప్పుడే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. 1985 ఎన్టీఆర్ పాలన నుంచి మొదలైన హత్యలు వివిధ రూపాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు.

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఆకుల భూమయ్య ప్రమాదంలో మరణించిన సంఘటనపై సమక్షిగమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టిన భూమన్న జన సభను ఏర్పాటు చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ అన్నారు. సుదీర్ఘకాలం ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమాలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని, ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటనపై ప్రభుత్వమే జవాబు చెప్పాలని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 1971 జై ఆంధ్ర ఉద్యమం, 1975 ఎమ్జన్సీ, 1996 సాంస్కృతిక తెలంగాణ ఉద్యమంలో భూమయ్య చురుకైన పాత్ర పోషించారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ అన్నారు. ఆకుల భూమన్నను రాజ్యమే హత్య చేయించినట్లు భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు. పెద్దన్నలాంటి ఆకుల భూమన్న దుర్మరణం పాలవ్వడం ఎంతో బాధ కలిగించిందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. భూమయ్య మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మాడ్డి చేశారు.

ఇది సాధారణ మరణం కాదని.. సీమాంవూధుల కుట్రల వల్ల జరిగిన హత్యని అన్నారు. ఆకుల భూమయ్య ప్రజాస్వామిక పోరాటాల్లో ఆరితేరిన నాయకుడని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. టీపీఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు న్యాయవిచారణ జరపాల్సి ఉన్నదన్నారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆకుల భూమయ్య లేనిలోటు తీర్చలేనిదన్నారు. టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీవూపసాద్ మాట్లాడుతూ తెలంగాణ చివరి అంకంలో ఉండగా భూమయ్య మరణించడం బాధాకరమన్నారు. భూమయ్య మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి అన్నారు. సంఘమే శరణ్యం లేకపోతే అరణ్యం అనేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పని చేశారని ఎమ్మెల్సీ సుధాకర్‌డ్డి చెప్పారు. టఫ్ కో చైర్మన్ విమలక్క మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భూమయ్య మృతి అనేక అనుమానాలకు తావిస్తున్నదని మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నేత తిప్పర్తి యాదయ్య అన్నారు. భూమయ్య మృతిపై అనుమానాలను నివృత్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈ విఠల్ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భూమయ్య చేసిన కృషి అభినందనీయం అన్నా రు.
bumaya3
ఆకుల భూమయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, చుక్కా రామయ్య, మాజీ మంత్రి విజయరామారావు, సీనియర్ జర్నలిస్టులు కే రాంచంవూదమూర్తి, పాశం యాదగిరి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్షికసీ నేత గాదె దివాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రజా కవి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు శ్రీధర్ దేశ్‌పాండే, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతలు క్రాంతి, పల్లె రవికుమార్, సీపీఐ నగర శాఖ నాయకులు బోసు, తెలంగాణ డెమోక్షికటిక్ ఫ్రంట్ చైర్మన్ బెల్లయ్యనాయక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మైసయ్య, స్నేహితుడు హనుమాండ్లు, తెలంగాణ సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు పీ బడేసాబ్, డాక్టర్స్ జేఏసీ నేత నర్సయ్య, అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు పద్మ, ఏపీసీఎల్సీ నాయకురాలు రత్నమాల, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, కార్యదర్శి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి జయ, జనశక్తి మాజీ నేత చంద్రన్న, పిట్టల రవీందర్, బెల్లయ్యనాయక్, ధనుంజయ్, వెంకటడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సింహడ్డి, డీటీఎఫ్ నాయకులు కిష్టప్ప, నర్సింగరావు, బుర్ర రాములు, కృష్ణయాదవ్, తెలంగాణ రైల్వే ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ముత్తయ్య, న్యూ డెమోక్షికసీ నాయకులు ప్రదీప్, ఝాన్సీ, పద్మ, జేఏసీ నాయకులు ఉప్పునూతల సుధాకర్, బండి రమేష్, అవుల బాలరాం, చిక్కుడు ప్రభాకర్, హన్మండ్లు, అరుణోదయ రామరావు, హెచ్‌అర్‌ఎఫ్ జీవన్‌కుమార్, ఓయూ జేఏసీ నేత రాకేష్, శ్రీహరి పాల్గొన్నారు.

టిప్పర్ డ్రైవర్ అరెస్టు
తెలంగాణ ఉద్యమనేత ఆకుల భూమయ్య మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. విద్యానగర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి జరిగిన దుర్ఘటనలో భూమయ్య మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను గుడిమల్కాపూర్‌కు చెందిన బల్దియా కాంట్రాక్ట్ డ్రైవర్ చెన్నయ్య (28) నడిపాడని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. భూమయ్య కూతురు సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద (ఎఫ్‌ఐఆర్- 291/2013) చెన్నయ్యపై కేసు నమోదు చేశారు. ఆగిఉన్న ఆటోను ఓవర్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని టిప్పర్ డ్రైవర్ చెన్నయ్య తెలిపాడు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.