వీడియో జర్నలిస్ట్ భిక్షపతి అమర్ రహే !

రాయినిగూడెం గ్రామసభలో సీఎం ఆధిపత్యాన్ని ధిక్కరించి  జై తెలంగాణ అని నినదించిన గొంతు మూగబోయింది. మానుకోటలో రాళ్ల వర్షానికి జడవకుండా.. కొండా గూండాల తుపాకిగుండ్లకు కెమెరాను అడ్డుపెట్టి. బాధితులను ఆస్పత్రికి తరలించిన చేతులు కట్టెసర్సుకుపోయాయి. వరంగల్ జిల్లాలో విద్యార్థి, జర్నలిస్టు, ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్న వీడియో జర్నలిస్ట్ మాడిశెట్టి భిక్షపతి ఇకలేరు.  తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న భిక్షపతి సంవత్సరకాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మరణించిన్రు. బుచ్చన్నకు పోరుతెలంగాణ నివాళి.. భిక్షపతి అమర్ రహై..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.