భారీ ఎన్‌కౌంటర్

 

encountorమృతుల్లో కేకేడబ్ల్యూ కార్యదర్శి సుధాకర్ దంపతులు.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి తొమ్మిది మృతదేహాల తరలింపు
కోవర్ట్ ఆపరేషన్.. కాల్పులకు ముందే విషవూపయోగం?.. పక్కా సమాచారంతో పోలీసుల ముప్పేట దాడి.. ఇది కోవర్ట్ ఆపరేషనేనన్న విరసం
అదుపులో
అగ్రనేతలు?
బుల్లెట్ గాయాలతో చిక్కిన మావోయిస్టులు!
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ సందర్భంగా గాయాలపాలైన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిడ్డి, మల్లా రాజిడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురికి బుల్లెట్ గాయాలుకాగా పారిపోయేందుకు అవకాశం లేకపోవడంతో పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని దట్టమైన అటవీ ప్రాంతం లో గురువారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సంబంధించిన మావోయిస్టు ప్లీనరీ జరిగినట్లు ప్రచారంలో ఉంది. ఈ ప్లీనరీలో కేకేడబ్ల్యూను పటిష్టం చేయాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో కేకేడబ్ల్యూ కమిటీలోని సుమారు 17 మంది సమావేశమైనట్లు తెలిసింది. సుమారు 1 గంట వరకు సమావేశం నిర్వహించిన సభ్యులు తర్వాత నిద్రకు ఉపక్షికమించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడిలో పైన పేర్కొన్న అగ్రనేతలు బుల్లెట్ గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు తమ వెంట తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరో నలుగురు మావోయిస్టుల జాడ కూడా తెలియడం లేదని అంటున్నారు.

(టీ మీడియా ప్రతినిధి, ఖమ్మం, భద్రాచలం):మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లా సరిహద్దు లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడ్ సమీపంలోని పువర్తి అడవుల్లో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి సుధాకర్ సహా 9 మంది నక్సల్స్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనలో 16 మంది చనిపోయారని అనధికారికంగా తెలుస్తోంది. భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు అంటున్నా.. కోవర్టు ఆపరేషన్ కోణంపైనా చర్చ జరుగుతోంది. మృతదేహాల్లో చాలామటుకు తలలు ఛిద్రమైపోయి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇది కోవర్టు ఆపరేషనేనని విరసం నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మృతుల్లో సుధాకర్ భార్య పుష్పక్క సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. దాదాపు 4గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ సభ్యులు, పలువురు స్థానిక గిరిజనులు సహా 30మందికి పైగా గాయపడి ఉంటారని భావిస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు ఏమైనా గాయాలు అయ్యాయా? వీరిని, గాయపడిన మావోయిస్టులు, గిరిజనులను ఎక్కడికైనా తరలించారా? అన్న విషయంలో పోలీసులు వివరాలు చెప్పలేదు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఎవరూ గాయపడలేదని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్కేసింగ్ స్పష్టం చేశారు. విజయవంతంగా ఎన్‌కౌంటర్ చేసినందుకు బలగాలను ఆయన అభినందించారు. ఘటనాస్థలంలో 9 మృతదేహాలను మాత్రమే కనుగొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పదో మృతదేహాన్ని కూడా తాము కనుగొన్నామని, కానీ.. దానిని తరలించలేదని ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారి ఒకరు వెల్లడించారని వార్తలు వచ్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరికొందరు మావోయిస్టులు కూడా చనిపోయి ఉండవచ్చని ఒక సీనియర్ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరూ వెళ్లకుండా పామేడుకు సమీపంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు విలేకరులు ప్రయత్నించినా, పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లు తెలియడంతో వారు ఏ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటున్నారో పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని చర్లకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో మావోయిస్టు కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. పామేడు సమీపంలో సమావేశం జరుగుతున్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థలానికి ఆహారం, మంచినీరు, ఇతర సరఫరాలపై నిఘా పెట్టారని తెలుస్తున్నది. మావోయిస్టులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని తెలియడంతో అందుకు దీటుగా భారీ సంఖ్యలో సంయుక్త దళాలను కూంబింగ్‌కు దించారు. తెల్లవారుజామున మావోయిస్టుల సమావేశ స్థలాన్ని కనుగొని.. దానిని మూడు వైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు తెలియవచ్చింది. ఉదయం దాదాపు 4గంటల పాటు తుపాకీ మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం అంతా బీభత్సంగా మారిందని తెలిసింది. సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ఆయా గ్రామాల స్థానికులు పేర్కొన్నారు.

9 మంది మావోయిస్టుల మృతి : ఎస్పీ రంగనాథ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పువర్తి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయని ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ భద్రాచలంలో విలేకరులకు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుకు సుమారు 1కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ దళాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌లో మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయన్నారు. ఈ సంఘటనలో 9మంది మావోయిస్టులు మృతిచెందారని పేర్కొన్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం7-గంటల మధ్య జరిగిందని తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు ఎస్‌ఎల్‌ఆర్, మూడు రైఫిల్స్, రెండు 303లు, ఒక కార్బన్, ఒక ఎస్‌బీఎంఎం ఆయుధాలు లభ్యమయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున విప్లవ సాహిత్యం లభించిందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ వార్త తెలియగానే జిల్లా ఎస్పీ రంగనాథ్, కొత్తగూడెం ఓఎస్డీ తోట శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌డ్డి భద్రాచలం హెలీప్యాడ్ వద్దకు ఉదయమే చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో అక్కడి పోలీసులకు ఆహార పదార్థాలు, మంచినీరు పంపించారు. ఎస్పీ రంగనాథ్‌తో పాటు జిల్లా పోలీసు అధికారుల బృందం కూడా హెలికాప్టర్‌లో సంఘటనస్థలానికి వెళ్లింది. సాయంవూతానికి మళ్లీ భద్రాచలం వచ్చిన హెలికాప్టర్.. 9 మృతదేహాలను తీసుకుని వచ్చింది. అనంతరం వాటికి పోస్టుమార్టం నిర్వహించారు.

ఎన్‌కౌంటర్‌లో కేకేడబ్ల్యూ కార్యదర్శి సుధాకర్, ఖమ్మం జిల్లా కార్యదర్శి, ఉత్తర తెలంగాణ స్పెషల్‌జోన్ కమిటీ సభ్యుడు ఎరువ శివాడ్డి అలియాస్ కిరణ్, కేకేడబ్ల్యూ సభ్యురాలు, నర్సంపేట, గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి గుగులోత్ లక్ష్మి అలియాస్ పుష్పక్క(సుధాకర్ భార్య), వరంగల్, మహదేవ్‌పూర్ ఏరియా కార్యదర్శి ఎట్టి నర్సక్క అలియాస్ సబిత, యాక్షన్‌టీం కార్యదర్శి దుర్గం రాజు అలియాస్ సుంకరి రాజు, మడక భీమా అలియాస్ అజయ్, మద్ది సీత మృతి చెందారు. మృతుల్లో కేకేడబ్ల్యూ కమిటీలోని ఎక్కువ మంది మృతులు వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. దీంతో కేకేడబ్ల్యూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పోలీసులు పేర్కొంటున్నారు. మరో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెనా, నల్లగొండ జిల్లా అరవపల్లికి చెందిన ఊర్మిళగా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిడ్డి ఉన్నట్లు మొదట అనుమానించారు. రాజిడ్డితో పాటు సుఖ్‌దేవ్ కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసులు మొదట పేర్కొన్నారు. వారి వద్ద దొరికిన అత్యాధునిక ఆయుధాల ఆధారంగా అగ్రనాయకులున్నట్లు పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. మృతదేహాలను భద్రాచలం తీసుకువచ్చిన తరువాత గుర్తించిన వారిలో ఆ ఇద్దరు నేతలు లేరు.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది ఎందరు?
ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది మృతి చెంది ఉంటారనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రవూపదేశ్ పోలీసులు, గ్రేహౌండ్స్, కోబ్రా ముప్పేట దాడిలో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే భద్రాచలం ఆస్పవూతికి 9 మృతదేహాలు వచ్చాయి. చనిపోయిన ఇతరుల్లో దళ సభ్యులు, ఆ ప్రాంత గిరిజనులు ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కమిటీ సమావేశం జరుగుతున్నట్లు పోలీసులు పక్కా సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలతో మోహరించి, మావోయిస్టులపై దాడికి పూనుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంపై గత మూడు రోజులుగా పోలీసులకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగువైపులా తప్పించుకునేందుకు వీలుగా ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రాంతాన్ని మూడు వైపుల నుంచి చుట్టుముట్టారని సమాచారం. ఈ సమావేశంలో అగ్రనేతలు ఎవరైనా పాల్గొన్నారా? పాల్గొని ఉంటే ఎదురుకాల్పుల నుంచి తప్పిచుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే ప్రయత్నాల్లో ఉండగా.. దానిని పసిగట్టిన మావోయిస్టు కేడర్ ముందు జాగ్రత్తగా నేతలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటారని భావిస్తున్నారు.

కోవర్ట్ ఆపరేషన్ జరిగిందా?
ఒకే సంఘటనలో ఇంతమంది మావోయిస్టులు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఒక మావోయిస్టు నాయకుడే పోలీసులకు కోవర్టుగా మారి ఈ పని చేసి ఉంటాడన్న వాదన వినిపిస్తున్నది. మావోయిస్టు కేడర్‌ను ఒక్క పెట్టున అంతం చేసేందుకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఎదురుకాల్పులు జరగకముందే వారిపై విషవూపయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మావోయిస్టు కేడర్‌ను అంతం చేసేందుకు ఎన్నోసార్లు పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన ఎన్‌కౌంటర్ ఇదే. 2006లో కంచాల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ఇదే పెద్ద ఎన్‌కౌంటర్.

ఇది కోవర్ట్ ఆపరేషనే : విరసం
ఛత్తీస్‌గఢ్‌లో అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని, ఇది ముమ్మాటికీ కోవర్ట్ ఆపరేషనేనని విప్లవ రచయితల సంఘం పేర్కొంది. ఆదివాసులకు బాసటగా నిలుస్తున్న మావోయిస్టులను కోవర్టు ఆపరేషన్ ద్వారా దారుణంగా హత్య చేశారని ఆరోపించింది. ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విరసం కార్యదర్శి పీ వరలక్ష్మి, కార్యవర్గ సభ్యులు వరవరరావు, పాణి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు గనుల్ని అమ్మే దళారీగా మారిందని వారు ఆ ప్రకటనలో విమర్శించారు. ఈ దళారీ విధానాలకు అడ్డుగా నిలుస్తున్న ఆదివాసీలను, వారికి బాసటగా నిలిచే విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు నిర్వహిస్తున్న హత్యాకాండలో భాగంగానే ఈ కోవర్టు ఆపరేషన్ జరిగిందని వారు ఆరోపించారు. ‘ఇది పోలీసులు పేర్కొంటున్నట్లుగా ఎన్‌కౌంటర్ కాదు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారాన్ని బట్టి దానిని ఎన్‌కౌంటర్‌గా ఎవరూ నమ్మరు. విప్లవోద్యమంపై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గ్రీన్‌హంట్‌లో భాగంగానే ఈ ఘటన జరిగింది’ అని పేర్కొన్నారు. ఈ హత్యాకాండను ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని వారు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.