సరిహద్దు నియంవూతణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా.. తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. భారత గగనతలంలోకి చైనా హెలికాప్టర్లు వచ్చి చక్కర్లు కొట్టాయి. దీంతో భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నెల 21న ఆగ్నేయ లెహ్‌కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో చుమ్మర్ వద్ద రెండు చైనా హెలికాప్టర్లు కొంతసేపటికి వరకు చక్కర్లు కొట్టాయి. అక్కడ ఆహార క్యాన్లు, సిగరేట్టు ప్యాకేట్లు, తమ భాషలో రాసి ఉన్న కాగితాలు పడేసి వెళ్లారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. కాగా, లడఖ్‌లోని డెప్సంగ్ వ్యాలీలో తమ సైనికుల చొరబాటుపై వెనక్కితగ్గేందుకు చైనా నిరాకరించింది.