భారం ఉండదు

 

kirankuపేద, మధ్యతరగతి ప్రజానీకంపై
విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి కిరణ్
200 యూనిట్ల లోపు బిల్లుల్లో
మార్పు ఉండదు
అదనపు భారానికి
ప్రభుత్వ సబ్సిడీ
2.17 కోట్ల మందికి
వెసులుబాటు
గృహ విద్యుత్‌కు
అదనపు సబ్సిడీ
రూ.1కోట్లు
మొత్తంగా సర్కారు సబ్సిడీ
రూ.6,312 కోట్లు
ఈసారి ఎఫ్‌ఎస్‌ఏ
లేకుండా చూస్తాం
రెస్కోలకు అదనపు సబ్సిడీ
రూ.12 కోట్లు

రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులపై చార్జీల భారం ఉండదని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి స్పష్టం చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా తాము నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటివరకు వారు చెల్లిస్తున్న చార్జీలనే చెల్లిస్తారని, అదనంగా పెరిగిన భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించనున్నదని ఆయన చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తదుపరి ముఖ్యమంత్రి కిరణ్ గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 2.55 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో 2.17 కోట్ల కనెక్షన్ల కింద ఉన్న వినియోగదారులపై పెరిగిన చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరంతా ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన పేద, మధ్యతరగతి ప్రజానీకమేనని, వీరిపై విద్యుత్ చార్జీల భారం ఉండదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,312కోట్ల మేరకు సబ్సిడీ భారాన్ని భరిస్తుందని సీఎం ప్రకటించారు. వీటిల్లో రెస్కోలకు రూ.12కోట్ల అదనపు సబ్సిడీ కాగా, 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు రూ.818 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. వీలైనంత మేరకు ఈ ఏడాది (2013-14)లో ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ) పడకుండా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలపై ఎఫ్‌ఎస్‌ఏ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాదని తెలిపారు. విపక్షాలు రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనలు చేస్తూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వారి దగ్గర (విపక్షాలు) తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కంటె వేరెవరూ మేలు చేయలేరు, చేయబోరని అన్నారు.

ఇప్పటికీ ఇంకా విద్యుత్ చార్జీలపై ఆందోళనలు చేస్తే వారంతా పెట్టుబడివర్గాల కోసమే చేస్తున్నారని అనుకోవాల్సిందే తప్ప ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. వీలైనంత మేరకు ప్రజానీకంపై ఆర్థిక భారం పడకుండా ఆ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రూ.5,480కోట్ల విద్యుత్ సబ్సిడీకి అదనంగా రూ.830కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని గుర్తుచేశారు. పెరిగిన విద్యుత్ చార్జీల అంశంపై సీఎం కిరణ్ గురువారం సాయంత్రం సచివాలయంలో తొమ్మిది మంది మంత్రుల ఉపసంఘంతో సమీక్ష జరిపారు. తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణడ్డి, జే గీతాడ్డి, పీ సుదర్శన్‌డ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీ శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌డ్డి, పార్థసారథి, సునీతా లకా్ష్మడ్డి, పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో 2.55కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గృహవినియోగంలో 2కోట్లకు పైగా కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో 0-50 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన కనెక్షన్లు ఒక కోటి వరకు ఉన్నాయని, వారి విద్యుత్ వినిమయం రేటు ప్రతి యూనిట్‌కు రూ.5.25పైసలు అయితే వినియోగదారులు కేవలం రూ.1.45లు మాత్రమే చెల్లిస్తున్నారని, మిగతా మొతాన్ని యూనిట్‌కు రూ.3.80ల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందని చెప్పారు.

ఇక 51-100 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన వినియోగదారులు 51లక్షల మంది ఉన్నారని, వారి తొలి శ్లాబు 0-50 యూనిట్లకు రూ.1.45లు, 51-100 యూనిట్లకు రూ.3.25లు ఈఆర్సీ నిర్ణయించిందని, రెండో శ్లాబులో ఇప్పటివరకు యూనిట్ ధర రూ.2.60ల నుంచి కొత్తగా పెరిగిన రూ.3.25ల మధ్య తేడా రూ.2.65పైసలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా 0-150 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన వినియోగదారులు రాష్ట్రంలో 22.9లక్షల మంది ఉన్నారని, వీరంతా 101-150 యూనిట్ల శ్లాబులో ఇప్పటివరకు యూనిట్‌కు రూ.3.60ల చొప్పున చెల్లిస్తుండగా, కొత్త రేటు ప్రకారం రూ.4.88లు చెల్లించాల్సి వస్తుందని, పెరిగిన యూనిట్ ధర రూ.1.28లను ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. 151-200 విద్యుత్ వాడకం కలిగిన వినియోగదారులు 11.4లక్షల మంది ఉన్నారని, వీరికి గతంలో యూనిట్ ధర రూ.3.60లు ఉండగా కొత్త రేటు రూ.5.63లు ఈఆర్సీ నిర్ణయించిందని, పెరిగిన ధర తేడా యూనిట్‌కు రూ.2.03 ఉందని, దీనికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ లోటుకు ప్రభుత్వ ప్రణాళికల లోపం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.