భరతమాత రుణాన్ని తీర్చుకుంటా!

zdghtc– ప్రతి ఒక్కరూ దేశానికి రుణపడి ఉన్నారు
– దానిని తీర్చుకోవడం అందరి బాధ్యత: నరేంవూదమోడీ
– ‘ప్రధాని ఆకాంక్ష’ బయటిపెట్టిన గుజరాత్ సీఎg

ప్రధానమంత్రి కావాలన్న తన ఆకాంక్షను మరింత ప్రస్ఫుటంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ వెల్లడించారు. భరతమాత రుణాన్ని తీర్చుకుంటానని, ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యమని చెప్పారు. ‘‘మోడీ మాత్రమే కాదు ప్రతి చిన్నారి, పౌరుడు కూడాభరతమాతకు రుణపడి ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఒక ప్రాణాన్ని నిలబెట్టడం ద్వారా ఒక వైద్యుడు.. పాఠాలు బోధించడం ద్వారా ఒక ఉపాధ్యాయుడు భరతమాత రుణాన్ని తీర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తమ రుణాన్ని చెల్లించుకోవాల్సిందే. ఎవరూ కూడా తనకు రుణపడి వెళ్లిపోకుండా భారతమాత తన ఆశీస్సులు అందజేస్తుందని ఆశిస్తున్నా’’ అని వివరించారు. తద్వారా తాను ప్రధాని పగ్గాలు చేపట్టాలనుకుంటున్న విషయాన్ని చెప్పకనేచెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని నిలబెట్టాలని ఇప్పటికే ఆ పార్టీలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి మోడీని తీసుకున్నారు. ప్రధాని రేసులో ఆయన ఉన్నారని చెప్పడానికి ఇదే సంకేతమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తన ప్రధాని ఆకాంక్షను మోడీ బహిరంగంగా వ్యక్తంచేయలేదు.

సీఐఐ పారిక్షిశామికవేత్తల సదస్సులో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మోడీ గురువారం గాంధీనగర్‌లో ఓపుస్తకావిష్కరణ కార్యక్షికమంలో పాల్గొన్నారు. ‘మోడీ గుజరాత్ రుణాన్ని తీర్చుకున్నారు. ఇక ఆయన భారతదేశ రుణాన్ని కూడా తీర్చుకోవాల్సి ఉంది’ అని రచయిత ఆర్పీ గుప్తా చేసిన వ్యాఖ్యలకు మోడీ ఈ విధంగా స్పందించారు. గుప్తా రాసిన ‘టర్న్ అరౌండ్ ఇండియాథూ ఇన్‌క్లూజివ్ గవ్నన్స్ అండ్ టీమ్ స్పిరిట్’ పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించారు. అభివృద్ధి రాజకీయాల అజెండాను గుజరాత్ తెరపైకి తెచ్చిందని మోడీ పేర్కొన్నారు. మోడీ ప్రజలకు నచ్చినా, నచ్చకపోయినా అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తున్నారని, ఇది స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.