భద్రాద్రి తెలంగాణదే

-పోలవరం సాకుతో ఆంధ్రాలో కలిపే కుట్రలు మొదలు
-ఈ ప్రతిపాదనలు ఒప్పుకోబోమని స్థానికుల స్పష్టీకరణ
-బ్రిటీష్‌కాలంలో కలిపినప్పుడే నష్టపోయామని వ్యాఖ్య

భారతీయుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు నడయాడిన నేల..భద్రాచలం. హిందూ, ముస్లిం సోదర భావానికి నిలు నిదర్శనం అక్కడి రామాలయం. తెలంగాణలోని మతసామరస్యానికి మచ్చుతునక భద్రగిరి. ముస్లిం ప్రభువు నుం చి హిందూ దేవుడికి అధికారిక పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన సంప్రదాయాని కి చిరునామా.
badra
గ్రంథస్తమైన తెలంగాణ చరివూతలో శతాబ్దాలుగా అంతర్భాగం.. భద్రాచలం. ఆనాడు బ్రిటిషోళ్లు సాగునీటి కోసమని భద్రాచలం ఏజెన్సీని ఆంధ్రా లో కలపారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక భద్రాచలం డివిజన్ ఎప్పటిలాగే తెలంగాణలోకి వచ్చి చేరింది. ఈ మార్పుల వల్ల కొన్నాళ్లపాటు ముల్కీ నిబంధనలు అమలు కాక ఆనాడే భద్రాద్రి నష్టపోయింది. ప్రస్తుతం గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలోని 200పై చిలుకు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలిపితే సమస్యలుండవనే ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రతిపాదనను స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శతాబ్దాల భద్రాచలం చరిత్ర, స్థానికుల అభివూపాయాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

13 ఏళ్ల పాటు దరిచేరని ముల్కీ హక్కు
గతంలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ భద్రాచలం, నూగూరు తాలుకాలుగా ఉండేది. తదుపరి ఎనిమిది మండలాలతో 567 రెవెన్యూ గ్రామాలతో ఉత్తరాన వాజేడు మండలం నుంచి గోదావరి నదీ ప్రాంతంలో తూర్పున తుమ్మిలేరు, పోచవరం (వీఆర్‌పురం మండలం)వరకు దట్టమైన అటవీ ప్రాంతంతో నిండి ఉంది. గోదావరి నది ఏడు మండలాల పొడవునా వాజేడు మండలం నుంచి సుమారు 170 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఇక్కడ జనాభా 2 లక్షల 98 వేల 255. వీరిలో 50.89 శాతం గిరిజనులు, 11.94 శాతం దళితులు, 37.17 శాతం ఇతర వర్గాలు ఉన్నాయి. 1958 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం17-11-1959లో రెవెన్యూ నోటిఫికేషన్ నెంబర్ 533 ద్వారా పాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో (తెలంగాణ)లో 30-11-1959లో విలీనం చేసింది. ఈ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేసినా, ఇక్కడి ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో ముల్కీ హక్కును కల్పించలేదు. 1972 వరకు ముల్కీ హక్కు పొందలేక విద్య,ఉద్యోగాలకు, అభివృద్ధికి దూరమైంది.

దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కోసమే విలీనం
బ్రిటిష్ పాలనలో అప్పటి అధికారులు భద్రాచలం డివిజన్‌లో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. సర్ ఆర్ధర్ కాటన్ ఈ నిర్మాణం చేపట్టారు. ఆం ధ్రాకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడం కోసమే భద్రాచలం ప్రాంతాన్ని తూర్పుగోదావరిలో కలిపారు. కాకినాడ జిల్లాలో ఈ ప్రాంతం ఉండటంతో ఇక్కడివాసులు పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరాభా రం అయ్యేది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని ఖమ్మంలో కలపాలనే నినాదం పుట్టింది. దీంతో ఆంధ్రవూపదేశ్ ప్రభు త్వం భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో చేర్చింది. పోలవ రం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని సజీవ సమాధి చేయాలనుకున్న ప్రభుత్వం కుట్రను ఈ ప్రాంతవాసులు వ్యతిరేకిస్తున్నారు.

భద్రాచలం సహజ వనరులను ఉపయోగించుకుని ఆంధ్రాను సస్యశ్యామలం చేయాలనే ఎత్తుగడపై స్థానికులు ఉద్యమిస్తున్నారు. గోదావరి జలాలను కృష్ణాబ్యారేజి నుంచి రాయలసీమకు అనంతరం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలించుకపోయేందుకే పోలవరం అవసరం. దీంతో పోలవరానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమంలో ఎంతోమంది పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఓ వైపు భద్రాచలం ప్రాంత ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం మరోమారు ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపాలనే యోచనపై స్థానికులు మండిపడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీని తెలంగాణలోనే కొనసాగిస్తే రాబోయే కాలంలో బాసర (ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు )గల గోదావరి నది 85 శాతం జలాలను లిఫ్ట్‌ల ద్వారా, దుమ్ముగూడెం, రుద్రంకోట ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, హైడ్రో విద్యుత్‌ను పొందే అవకాశం ఉంటుంది. కాటన్ ప్రవచించిన గోల్డెన్‌లిక్విడ్ (నీటిని అనుభవించే అదృష్టం) కలుగుతుందని ఈ ప్రాంతవాసులు అభివూపాయపడుతున్నారు.

నేటికీ రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు
336 ఏళ్ల ఘనచరిత్ర భద్రాచలానికి ఉంది. హైదరాబాద్‌లోని గోల్కొండ కేం ద్రంగా తెలంగాణను పాలిస్తున్న తానీషా ప్రభువు కింద తహసీల్తార్‌గా పనిచేస్తూ క్రీశ 1674లో రామదాసు(కంచెర్ల గోపన్న) రామాలయం నిర్మించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను తానీషాకు జమ చేయకుండా భద్రాచంలో రాముడికి గుడికట్టించి గోల్కొండ బందీఖానాలో రామదాసు శిక్ష అనుభవించాడు. రామదాసు భక్తి పారవశ్యాన్ని మెచ్చిన తానీషా ప్రభువు రామభక్తుడిగా మారిపోయి సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంవూబాలు సమర్పించారు. ఆనాడు మొదలైన పట్టువస్త్రాల సమర్పణ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. నిజాం కాలంలో తెలంగాణ నిధులతో నిర్మించిన ఈ ఆలయాన్ని, చరివూతను వదుకునేందుకు సిద్ధంగా లేమని తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు. పోలవరం కోసం తెలంగాణ ఆస్తిత్వ చిహ్నమైన భద్రాచలాన్ని విడగొట్టాలనే కుట్రలను సహించబోమని హెచ్చరిస్తున్నారుపముఖ పుణ్యక్షేవూతంగా తెలంగాణలో విలసిల్లుతున్న భద్రాచలాన్ని రక్షించుకుంటామని ప్రతినబూనుతున్నారు.

భద్రాచలంపై సోనియాకు నివేదిస్తాం
హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యమున్న భద్రాచలంను తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగించాలని కాంగ్రెస్ అధి నేత్రి సోనియాగాంధీకి నివేదిస్తామని ఎమ్మెల్సీ పొం గులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నా. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు గుర్తింపు ఉన్నది భద్రాచలంతోనేనని, అదిపోతే అస్తిత్వమే కోల్పోతామ న్నారు. పోలవరం సాకుతో భద్రాచలాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరేచేస్తే ఊరు కోబోమన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఈ విషయంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

భద్రాచలం గుండెకాయ
భద్రాచలం తెలంగాణదే అనడానికి అనేక ఆధారాలు న్నాయి. ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో చేర్చాలనే కుట్రను సహించం. పోరాటాల ద్వారా మరోచరివూతను సృష్టిస్తాం. ఢిల్లీలో కూర్చొని భద్రాచలం చరిత్ర తెలియకుండా పాలకులు హద్దులు గీయ డం సమంజసం కాదు. ఆంధ్రాలో కలిపేందుకు ఇక్కడ సెటిలైన ఆంధ్రా వాళ్లు కూడా ఇష్టం లేదు. ప్రాణాలు తెగించైనా సరే భద్రాచలం తెలంగాణలో ఉం డేలా ఉద్యమిస్తాం.

-తిప్పన సిద్దులు, 1969 తెలంగాణ ఉద్యమనేత

తెలంగాణలో అంతర్భాగమే
ఈ ప్రాంతానికి ఎంతో చారివూతక నేపథ్యం ఉంది. రామాలయ నిర్వాహణ నిజాం ప్రభుత్వమే చూసుకునేది. ఏడాదికి రూ.40వేలు ఖర్చుల కోసం నిజాం చెల్లించేవారు. చుట్టుపక్కల ఆలయాలకు కూడా ఇచ్చేవారు. పాల్వంచ పరగణాలో భద్రాచలం ఉండేది. బ్రిటీష్‌వారు ఆక్రమించినప్పుడు దుమ్ముగూడెం ఆనకట్టకోసం మాత్ర మే తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలాన్ని చేర్చారు. అంతేకాని ఈ ప్రాంత ప్రజపూవరూ ఆంధ్రావాసులు కారు.

-చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, ప్రముఖ కవయిత్రి

తెలంగాణలో ఉండాల్సిందే
చారివూతకంగా ఆలయ పరిపాలన అంతా నవాబుల హయాంలోనే జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం తరపున శ్రీ సీతారామచంవూదస్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యా ల తలంవూబాలు వస్తున్నాయి. రామదాసు కాలం నుంచి ఈ ప్రాంతం తెలంగాణతో ముడిపడి ఉంది. ఇంత విశిష్టత, ఆవశ్యకత ఉన్న ఈ ప్రాంతం తెలంగాణలో ఉండాల్సిందే.

-పొడిచేటి రామచంవూదాచార్యులు,
భద్రాద్రి విశ్రాంత ప్రధానార్చకులు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.