భద్రాచలాన్ని తెలంగాణ నుంచి వేరు చేయడం ఎవరితరం కాదు

‘భద్రాచలాన్ని తెలంగాణ నుంచి వేరు చేయడం ఎవరితరం కాదు. టీ మంత్రలు జైత్రయావూతలు మాని సీమాంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోస్తున్న కిరణ్, సీమాంధ్ర మంత్రులపై దండయాత్ర చేసి రాజీనామా చేయాలి. కిరణ్, జగన్, చంద్రబాబులు తోడు దొంగలు. తెలంగాణపై యూ టర్న్ తీసుకున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రంపూర్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాలను బుధవారం వారు ఆవిష్కరించారు.
kamam
అనంతరం జరిగిన బహిరంగ సభలో, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాచలం, నల్లగొండలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించుకున్నాం. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కుట్రలు పన్నుతున్నాయి. అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే చాలు. సంపూర్ణ అధికారంతో కూడిన తెలంగాణ కోసం మనం అప్రమత్తంగా ఉండాలి. నది జలాలు, జీవో నెంబర్ 53, విద్యుత్ కేటాయింపు, భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలి. విభజన తరువాత నవతెలంగాణ పునర్నిర్మాణమయ్యే వరకు జేఏసీ కీలక భూమిక పోషిస్తుంది.

చారివూతకంగా, భౌగోళికంగా, సంస్కృతీ సంప్రదాయాలు, చట్టపరంగా ఎటు చూసినా భద్రాచలం డివిజన్ తెలంగాణలో అంతర్భాగమే. ఈ ప్రాంత ప్రజలు మొత్తం తెలంగాణలోనే ఉంచాలని కోరుకుంటున్నారు. వారి ఆత్మగౌరవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రా పాలకులకు ఈ ప్రాంతాన్ని ముంచాలనే ఆలోచనే తప్ప మరో ఆలోచన లేదు. భద్రాచలం తెలంగాణకు చెందినది అనడానికి వెయ్యేళ్ల చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వీటిని ఇటీవల జీవోఎంకు అందజేశాం. భద్రాచలం డివిజన్ ఆదివాసీల మనుగడ తెలంగాణతోనే ముడిపడి ఉంది. వారి హక్కులు కాపాడినట్లయితే సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. గోదావరి నదీ జలాలు సక్రమ పద్ధతిలో వినియోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు ఇప్పటికే తెలంగాణలో ఉన్నాయి. భద్రాచలాన్ని ఈ ప్రాంతం నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదు. ఆదివాసీ ప్రాంతమైన భద్రాచలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని, భక్తరామదాసుకు, భద్రావూదికి ఎంతో సంబంధం ఉంది. త్వరలో భద్రాచలం సమస్యపై హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తాం’ అని కోదండరాం పేర్కొన్నారు.

ముగ్గురు బాబుల మానసికస్థితి బాగాలేదు
‘తెలంగాణకు తలమానికమైన సింగరేణిని బతికించుకొని విస్తరింపజేసుకుంటాం. కేంద్రం నియమించిన జీఎంవోకు టీఆర్‌ఎస్ తెలంగాణపై తన వైఖరిని వెల్లడించింది. దేశంలోనే 49 శాతం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని, పది జిల్లాలు, 119 నియోజక వర్గాలతో కూడిన రాష్ట్రం ఏర్పాటు ప్రకటనలో భాగంగా భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని, అదే విధంగా ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని స్పష్టం చేశాం. ముగ్గురు బాబులకూ మానసిక స్థితి బాగాలేదు. వారు తోడు దొంగలు. తెలంగాణ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు సమన్యాయం అంటున్నాడు. సమన్యాయం అంటే ఏమిటని ప్రశ్నిస్తే మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. భద్రాచలం కోసం కొట్లాడేది కూడా పోలవరం ప్రాజెక్టు కోసం నీటిని దోచుకోవడానికే.

భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. భద్రాచలంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు. ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వంతో జరుపనున్న చర్చల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం స్పష్టంగా తెలుపుతాం. తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్న నేతలకు తగిన బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. జగన్ సీమాంవూధలో బలపడటానికి నాటకమాడుతున్నాడు. ఇక వారి ఆటలు సాగవ్వం. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే. సమైక్య నినాదం ఎత్తుకున్న వైఎస్సాపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను నల్లగొండ జిల్లా మంత్రులు అడ్డుకోవడం హర్షణీయమే కానీ, సీఎం కిరణ్ ప్లేట్ ఫిరాయిస్తే టీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. టీ మంత్రులు ఇంట గెలిచి రచ్చ గెలిస్తే ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. మంత్రులు నిజంగా తెలంగాణవాదులైతే సీఎం కిరణ్‌ను సామాజిక బహిష్కరణ చేయాలి. లేదంటే పదవులకు రాజీనామా చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చిందో ప్రజలకు తెలుసు. సాగర్ ప్రాజెక్టు జిల్లాలోనే ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు 57ఏళ్లుగా తాగునీరు కూడా అందించలేకపోయారు. వర్షాలకు జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది.

వెంటనే ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిచిన పత్తి, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలి. మంత్రి జానాడ్డి రాజకీయ ప్రాబల్యం కోసం జైత్రయావూతలు చేస్తున్నారు. యాత్రలు పక్కన పెట్టి తెలంగాణ రైతులపై సీఎం ఎందుకు కత్తి గట్టాడో నిలదీయాలి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.