భద్రతను గాలికొదిలేశారు

-ఈ పాలకులకు పాలించే హక్కులేదు :
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
-బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ

తెలంగాణ ఉద్యమ నేతలపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఉగ్రవాదులు దాడులు చేస్తారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. భద్రతను గాలికొదిలేసిన ఈ పాలకులకు పాలించే హక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్లలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడినవారికి సంఘీభావంగా టీఆర్‌ఎస్వీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ బాంబు దాడుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కార్యక్షికమంలో అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ, టీఆర్‌ఎస్వీ నేతలు భవానీశంకర్, నందగోపాల్, వినీత్, జనార్దన్, సనత్‌నగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇంచార్జీ కట్టెల శ్రీనివాస్‌యాదవ్, నేతలు బొడ్డు శ్రీనివాస్‌గౌడ్, మోత్కుపల్లి రమేష్, గోరెంకల రాజు, నారాయణరాజు, మోహన్‌బాబు, కిట్టుగౌడ్, సురేందర్‌సింగ్, రాజుసింగ్, తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.