భక్తులను అడ్డుకున్నారంటే.. విభజనకు అంగీకరించినట్లే కదా: వీహెచ్

‘మా ప్రభుత్వమే అధికారంలో ఉండి.. మాపైనే కేసులు పెట్టడం దురదృష్టకరం’ అని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. ‘నా పేరే హనుమంతు. నేను ఎవరికీ భయపడను. ఇప్పటివరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. పార్టీలో నిజాయితీగా పనిచేస్తూ జెండా మోస్తున్నా. నాపైనే నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెడుతున్నారు. ఇక పార్టీలోని సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుస్తున్నది’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఎంపీగా ఉన్న.. కేసు పెట్టేముందు ఒక్క మాటైనా అడిగి ఉంటే బాగుండేదన్నారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని సీఎం కిరణ్, డీజీపీ ఫోన్‌లో చెప్పినా తాను ఆ పనిచేయలేదన్నారు.
కానీ దాడి చేసిన వారితో మరుసటి రోజే తనపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేయడం అర్థం కావడంలేదన్నారు. తిరుపతిలో తాను రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేయలేదని, అసరమైతే మరోసారి మీడియా వద్ద ఉన్న చూడవచ్చన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ వెంక రెచ్చగొ మాట్లాడినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్ర శ్నించారు. కర్నూల్ జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి వెంబడి తెలంగాణ వారిని వెళ్లనీయబోమని టీజీ అన్నారని చెప్పారు. శ్రీశైలం దేవాలయం వద్దకు వెళ్లిన తెలంగాణ భక్తులను వెనక్కి పంపించారని చెప్పారు. తిరుపతి, శ్రీశైలాని రావద్దంటున్న సీమాంవూధులు విభజనకు అంగీకరించినట్లే కదా? అని వీహెచ్ అన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయులుగా కలిసుందామని, సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.