బ్రదర్ అనిల్.. తప్పించుకోలేవు – ‘బెనిటా’ జీఎం మృతి వెనుక బినామీ పెట్టుబడులు

– బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
హైదరాబాద్: బ్రదర్ అనిల్‌పై చేస్తున్న ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తీవ్రం చేశారు. గతంలో ప్రకటించిన 11 కంపెనీలతోపాటు మరో 4 కంపెనీలను అనిల్ బినామీలు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు సంబంధించిన కొన్ని కంపెనీలు ‘ఆదిత్య ఎన్‌క్లేవ్’ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.అనిల్‌కు చెందిన ‘బెనిటా’ కంపెనీ జనరల్ మేనేజర్ వీరభవూదాడ్డి ఆత్మహత్య వెనుక బినామీ ఆస్తుల గొడవలు ఉన్నాయని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బ్రదర్ అనిల్ దేశం నుంచి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని..

ఆయన పాస్‌పోర్టును వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆరోపణలకు సంబంధించిన పలు పత్రాలను మీడియాకు చూపించారు. గతంలో చెప్పినట్టుగా 11 కంపెనీల్లో పెట్టుబడులకు తోడుగా బెనిటా ఇండస్ట్రీస్,రక్షణ సిమెంట్, స్టీల్, ఆమోదా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీల్లో బ్రదర్ అనిల్‌కు పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న షర్మిల ‘బెనిటా’ కంపెనీకి చెందిన ఏపీ 09 సీజీ 0151 నంబర్ గల కారును వాడుతున్నారని చెప్పారు. రాజకీయ ఒప్పందం మేరకే ట్రాన్స్‌వూటాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం అప్పగిస్తున్నదని ఆరోపించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ పచ్చి మతతత్వవాది అని మండిపడ్డారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.