బోనమెత్తిన పాతనగరం

తెలంగాణ సాంస్కృతిక వేడుక బోనాల ఉత్సవంతో భాగ్యనగరం మరోసారి పులకించిపోయింది. హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం లాల్‌దర్వాజ బోనాల పండుగ చూడముచ్చటగా జరిగింది. పాతనగరం వీధులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. డప్పుదరువులు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల శివాలతో నగరం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు.. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలు తలపై ఎత్తుకొని ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయాలైన లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బోనాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రి గీతాడ్డి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సింహవాహిని మహంకాళికి బోనం సమర్పించారు.

అక్కన్న మాదన్న ఆలయంలో రాష్ట్ర మంత్రి ముఖేష్‌గౌడ్ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి జానాడ్డి, ఎంపీలు వీ హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ, టీఆర్‌ఎస్ నేతలు కే తారక రామారావు, దాసోజు శ్రవణ్‌కుమార్, బీజేపీ నేతలు జీ కిషన్‌డ్డి, బండారు దత్తావూతేయ తదితరులు పాల్గొన్నారు. 33 ఏళ్ల తర్వాత రంజాన్ మాసంలోనే వచ్చిన బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలో నెలకొన్న హిందూ- ముస్లిం సహజీవన సంస్కృతిని, సామరస్యాన్ని చాటాయి. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.