బొమ్మగాని ధర్మబిక్షం

manatankప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పేద వ్యవసాయ కుటుంబంలో 1922 ఫిబ్రవరి 15న ఆయన జన్మించారు. ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్ధూలలో పలు రచనలు చేయడంతో పాటు జర్నలిస్టుగా ‘మీజాన్’, రయ్యత్, గోల్కొండ పత్రికలలో పనిచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో ‘ఆంవూధ మహాసభ’, ఆర్యసమాజ్‌లలో పనిచేసి ఐదు సంవత్సరాల జైలు జీవితం కూడా అనుభవించారు. స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రవూపదేశ్ శాసనసభకు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిథ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2011 మార్చి 26న ఆయన తుదిశ్వాస వదిలారు. ధర్మభిఓం అమర్ రహే..

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.