బెంగళూరు ఏటీఎం అనుమానితుడు అరెస్ట్

బెంగళూరు: బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై ఓ వ్యక్తి తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు కర్నాటకలోని తుమ్ముకూరులో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. నవంబరు 19న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవాడానికి వెళ్లిన మహిళపై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి దుండగుడిని పట్టుకునేందుకు కర్ణాటక, ఏపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.