బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినా..యూపీఏకు మద్దతునివ్వం: జేడీయూ

యూపీఏ సర్కారుకు మద్దతునిచ్చే విషయమై జనతాదళ్ (యునైటెడ్) తన వైఖరిని స్పష్టంచేసింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ, యూపీఏకు మద్దతునివ్వబోమని, ఈ విషయంలో ఎలాంటి బేరసారాలకు తావులేదని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగీ గురువారం విలేకరులకు తెలిపారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు యూపీఏ నిర్ణయిస్తే స్వాగతిస్తామని, అంతమావూతాన తమ పార్టీ ఎన్డీయే కూటమిని వీడి బయటకు వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.‘

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.