బీసీ సబ్‌ప్లాన్ అవసరమే

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలోనే బీసీ సబ్‌ప్లాన్ అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అభివూపాయపడ్డారు. బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాయన్నారు. బుధవారం ఆయన లేక్‌వ్యూ అతిథి గృహంలో పలు బీసీ కుల సంఘాల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీల్లో ఇంకా పేదరికం ఉందని, సరైన విద్య, ఆయా వర్గాలకు జనాభా దామాషాలో రాజకీయ ప్రాతినిధ్యం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల అభ్యున్నతే ధ్యేయంగా నిధులను, సీట్లను కేటాయిస్తోందని చెప్పారు.

ఓబీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్‌పై కేంద్రాన్ని కలిసేందుకు జులై మొదటి వారంలో ఢిల్లీకి రావాలని కుల సంఘాల ప్రతినిధులను కోరారు. వృద్ధాప్య పెన్షన్లను రూ.200 నుంచి రూ.500కు పెంచుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు బీసీ కుల సంఘాల నేతలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. బీసీ రిజర్వేషన్, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.